లాక్‌డౌన్‌లో సెలబ్రిటీలు చేసిన పని ఇదేనా.. ఇళ్లల్లోనే కూరగాయల పెంపకం

లాక్‌డౌన్‌లో సెలబ్రిటీలు చేసిన పని ఇదేనా.. ఇళ్లల్లోనే కూరగాయల పెంపకం

లాక్‌డౌన్‌లో సెలబ్రిటీలు కొత్త హాబీని ఎంచుకున్నారు. మొక్కల పెంపకం అనేది పాపులర్ అయిపోయింది. టెర్రస్ మీద విత్తనాలు వేసి మొక్కలు పెంపకాన్ని ఎంజాయ్ చేయడంతో పాటు వెజిటేరియన్ మీల్స్ కోసం.. వారే కాయగూరలు పండించుకుంటున్నారు. పైగా ఈ తంతు మొత్తాన్ని ప్రకృతితో నా టైం ‘me time’ అనే హ్యాష్ ట్యాగ్‌తో సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటున్నారు.

ఈ మొక్కల పెంపకం గురించి సమంతా చెబుతూ.. ఇదొక గేమ్ ఛేంజర్ అని అభివర్ణించింది. ప్రతి ఒక్కరు ఎందుకని సొంత ఆహారాన్ని తయారుచేసుకోలేరు. వారికి వెసలుబాటు ఉన్న స్థలంలో పెంచుకోవచ్చు కదా. గార్డెనింగ్ అనేది గేమ్ ఛేంజర్. విత్తనం వేయడమనేది చాలా మార్పును తీసుకొస్తుంది. ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. ఇది మనం చాలా సార్లు విన్నాం. కానీ చెబుతున్నా ఆరోగ్యంగా సింపుల్ గా ఉండమని. తక్కువ సమయంలో తక్కువ కష్టపడితే సరిపోతుంది. ఎందుకంటే 2020 ఇంకా మనల్ని స్టే హోమ్ స్టే హోమ్ అనేలా చేస్తూనే ఉంది. నాకు తెలిసి మనం మేనేజ్ చేయగలం అనుకుంటున్నా.

దాంతో ఇంట్లో వాడకుండా ఉంచిన స్థలాన్ని ఆమె వాడుకున్నట్లుగా చెప్పారు. మీ టెర్రస్, బాల్కనీ, కిటికీ ఏదైనా సరే కొన్ని వారాల పాటు అలాగే ఉంచండి. మనతో పాటు అవి కూడా ఎదుగుతుంటాయి. మన అనుభవాలను పంచుకుందాం. తప్పుల నుంచి చివరికి నేర్చుకోగలుగుతాం. మనకు మనం ఆహారం పండించుకోగలగడం అనేది చాలా గౌరవమైన పని. ఒకవేళ మరోసారి లాక్‌డౌన్ వచ్చినా.. కంగారుపడకుండా తట్టుకుని నిలబడగలం’ అని అక్కినేని సమంత అంటున్నారు.

ఇదిలా ఉంటే సమంతా డైలీ తాను పెంచుతున్న మొక్కల గురించి… విత్తనాలు వేసిన విధానం గురించి.. అభిప్రాయాలు పంచుకుంటూనే ఉంటుంది.

ఇక ఇదే సమయంలో యోగా సెలస్రిటీ, బాలీవుడ్, టాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టి కూడా ఇదే చేశారని అన్నారు. ఇక శిల్పా ఇంట్లో కాసిన హెల్తీ, ఆర్గానిక్ పంట అయిన నిమ్మకాయలు తెంపుతూ ఆ వీడియోను పోస్టు చేశారు. ఇలాంటివన్నీ ఫుడ్ ఫర్ థాట్ అనే ప్రక్రియ నుంచే వస్తాయని అన్నారు.

తరచూ స్కిన్ కేర్ టిప్స్ షేర్ చేసే మలైకా.. తన ఇంట్లోని లిటిల్ హౌజ్ గార్డెన్ గురించి పోస్టు చేశారు. అలోవెరా లాంటి మెడికల్ ప్లాంట్స్ ను చూపించింది. అంతేకాకుండా తాజా మొక్కలు స్కిన్ సమస్యలకు ఎలా వాడాలో చెప్పింది.

మీరా కపూర్‌కు ఆర్గానిక్ తో పాటు హెల్తీగా ఉండటమంటే ఇష్టమట. ఎప్పుడూ దీని గురించే మాట్లాడే ఆమె.. ఇన్‌స్టాలో పెట్టిన పోస్టు ఇలా ఉంది. ‘పిల్లలు తెలివిగా ఉండటానికి ప్రకృతి నేర్పించినంతగా ఆన్‌లైన్ స్కూల్, ఫ్లాష్ కార్డ్స్, మ్యాథ్ టాయ్స్ లాంటివి ఏమీ నేర్పించవు’

‘నాకు వింటర్ అంటే చాలా ఇష్టం. వెచ్చని సూర్యుడు, తేమతో కూడిన గాలి, వాతావరణాన్ని ఆహ్లాదకరంగా చేస్తాయి. మా పిల్లలు కూరగాయలు, పూలు, పలు రకాల పురుగులు, మొక్కల్లో రకాలు వంటివన్నింటినీ గుర్తు పట్టగలుగుతున్నారు’ అని కపూర్ చేసిన పోస్టులో పేర్కొన్నారు.

లాక్‌డౌన్‌ను ఇలా వినియోగించుకోండంటూ ఐక్యరాజ్యసమితి గుడ్‌విల్ అంబాసిడర్ దియా మీర్జా ఓ ఫొటోను షేర్ చేశారు. మొక్కలపై నీటి తుంపరులను చూపిస్తూ.. స్టేయింగ్ హోమ్.. స్టేయింగ్ సేఫ్ అంటూ పోస్టు చేశారు.