SV Krishna Reddy : ఎనిమిదేళ్ల తర్వాత ఎస్వీ కృష్ణారెడ్డి సినిమా.. బిగ్‌బాస్ సోహైల్‌తో ప్రయోగం..

ఎనిమిది సంవత్సరాల తర్వాత సినిమాని తెరకెక్కించనున్నారు ఎస్వీ కృష్ణారెడ్డి. అది కూడా బిగ్ బాస్ ఫేమ్ సోహైల్ హీరోగా సినిమాని తీస్తున్నారు. 'ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు' అనే టైటిల్..

SV Krishna Reddy : ఎనిమిదేళ్ల తర్వాత ఎస్వీ కృష్ణారెడ్డి సినిమా.. బిగ్‌బాస్ సోహైల్‌తో ప్రయోగం..

Sohel

 

SV Krishna Reddy :  ఎస్వీ కృష్ణారెడ్డి.. చిన్న చిన్న సినిమాలు, కుటుంబ సమేతంగా చూడగలిగే సినిమాలు, మధ్యతరగతి విలువలు, భాదల్ని చెప్పే సినిమాలు తీస్తూ ఎన్నో విజయాలు అందుకున్న దర్శకుడు. మాయలోడు, రాజేంద్రుడు గజేంద్రుడు, అభిషేకం, యమలీల, శుభలగ్నం, మావి చిగురు, పెళ్ళాం ఊరెళితే, ఘటోత్కచుడు, యమలీల, ఎగిరే పావురమా… లాంటి ఎన్ని హిట్ క్లాసిక్ సినిమాలతో ప్రేక్షకులని మెప్పించారు ఎస్వీ కృష్ణారెడ్డి. కేవలం డైరెక్టర్ గానే కాక తన సినిమాలకి మ్యూజిక్ డైరెక్టర్ గా, నటుడిగా, రచయితగా కూడా పని చేశారు. చివరిసారిగా 2014లో యమలీల 2 తీశారు. అయితే ఆ సినిమా ఆశించినంత విజయం సాధించలేదు.

Police : గంజాయి సరఫరా కేసులో అరెస్ట్ అయిన అసిస్టెంట్ డైరెక్టర్

 

మళ్ళీ ఇప్పుడు ఎనిమిది సంవత్సరాల తర్వాత సినిమాని తెరకెక్కించనున్నారు ఎస్వీ కృష్ణారెడ్డి. అది కూడా బిగ్ బాస్ ఫేమ్ సోహైల్ హీరోగా సినిమాని తీస్తున్నారు. ‘ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు’ అనే టైటిల్ తో కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమాని తెరకెక్కించనున్నారు. ఇందులో రాజేంద్రప్రసాద్, సునీల్, వరుణ్ సందేశ్ ముఖ్య పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాని ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్ సతీమణి కల్పన నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. చాలా రోజుల తర్వాత ఎస్వీ కృష్ణారెడ్డి సినిమా సినిమా తీస్తుండటంతో ఓపెనింగ్ కి పలువురు సినీ ప్రముఖులు విచ్చేసారు. ఈ సినిమాతో కృష్ణారెడ్డి గ్రేట్ కంబ్యాక్ ఇవ్వాలని అంతా ఆశిస్తున్నారు.