Swathimuthyam : చిన్న బెల్లంకొండ ‘స్వాతిముత్యం’..

బెల్లంకొండ శ్రీనివాస్ తమ్ముడు బెల్లంకొండ గణేష్ బాబు హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్న ‘స్వాతిముత్యం’ గ్లింప్స్‌కు మంచి రెస్పాన్స్ వస్తుంది..

Swathimuthyam : చిన్న బెల్లంకొండ ‘స్వాతిముత్యం’..

Swathimuthyam

Swathimuthyam: ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ రెండో కొడుకు, టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తమ్ముడు బెల్లంకొండ గణేష్ బాబు హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ మీద యువ నిర్మాత సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాతో లక్ష్మణ్.కె.కృష్ణ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

Sankranthi 2022 : తెలుగు సినిమాలు.. సంక్రాంతి శుభాకాంక్షలు..

వర్ష బొల్లమ్మ కథానాయిక. రావు రమేష్, వీకే నరేష్, ప్రగతి, సురేఖ వాణి కీలకపాత్రల్లో నటిస్తున్నారు. మణిశర్మ తనయుడు మహతి స్వరసాగర్ సంగీతమందిస్తున్నాడు. ఇటీవల రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. సంక్రాంతి కానుకగా ‘స్వాతిముత్యం’ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు.

Balakrishna : గుర్రమెక్కిన ‘నటసింహం’.. నందమూరి ‘యువసింహం’..

గ్లింప్స్ ఆద్యంతం ఎంటర్‌టైనింగ్‌గా సాగుతూ ‘స్వాతిముత్యం’ ఫీల్ గుడ్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అనిపించింది. గణేష్, వర్షల పెయిర్ బాగుంది. డైలాగ్స్, విజువల్స్ అండ్ ఆర్ఆర్ బాగుంది. త్వరలో ‘స్వాతిముత్యం’ ప్రేక్షకుల ముందకు రానుంది.