మేకపిల్లైతే కోసుకుని తింటా.. ఆడపిల్లైతే అమ్ముకుని తింటా..

తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా మంగ్లీ ప్రధాన పాత్రలో నటించిన ‘స్వేచ్ఛ’ టీజర్ రిలీజ్..

  • Published By: sekhar ,Published On : February 17, 2020 / 08:17 AM IST
మేకపిల్లైతే కోసుకుని తింటా.. ఆడపిల్లైతే అమ్ముకుని తింటా..

తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా మంగ్లీ ప్రధాన పాత్రలో నటించిన ‘స్వేచ్ఛ’ టీజర్ రిలీజ్..

ఆడపిల్ల పుడితే చాలు అమ్మో.. అనుకుంటూ అమ్మేస్తున్న సమాజమిది. అలా అమ్మకానికి గురై, అభాగ్యురాలైన ఓ యువతి ఈ సమాజంలో ఎలా బతికింది? ఏం సాధించింది.. అనే కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘స్వేచ్ఛ’. ప్రముఖ గాయని మంగ్లీ టైటిల్‌ రోల్‌పోషించింది.

కెపీఎన్‌. చౌహాన్‌దర్శకత్వంలో సరస్వతి డెవలపర్స్‌, లచ్చురాం ప్రొడక్షన్స్‌ పతాకంపై ఆంగోత్‌ రాజునాయక్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఫిబ్రవరి 17న తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా.. ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేస్తూ ‘స్వేచ్ఛ’ టీజర్ రిలీజ్ చేశారు. ఆడపిల్ల గొప్పదనాన్ని తెలుపుతూ బంజారా నేపథ్యంలో తెరకెక్కిన ‘స్వేచ్ఛ’ టీజర్ ఆకట్టుకునేలా ఉంది.

‘‘మేకపిల్లైతే కోస్కోని తింటా.. ఆడపిల్లైతే అమ్ముకుని తింటా’’.. వంటి డైలాగులు ఆలోచింప చేసేలా ఉన్నాయి. మంగ్లీ, చమ్మక్ చంద్ర తదితరుల నటనతో పాటు విజువల్స్, ఆర్ఆర్ బాగున్నాయి. మంగ్లీ పాడిన ‘బంజారే బంజారే’ పాట హైలెట్‌గా నిలిచింది. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.