Bigg Boss 5 : బిగ్ బాస్ లో ఆరో ఎలిమినేషన్.. శ్వేతా వర్మ అవుట్..

ఇన్ని రోజులు శ్వేతా నామినేషన్స్‌లోకి రాకపోవడం వల్ల సేవ్ అయింది. ఈ సారి నామినేషన్స్ లో ఉండటంతో ఎలిమినేట్ అయిపోయింది.

Bigg Boss 5 : బిగ్ బాస్ లో ఆరో ఎలిమినేషన్.. శ్వేతా వర్మ అవుట్..

Swetha Varma

Bigg Boss 5 : తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 ఆరో వారానికి చేరుకుంది. మొత్తం 19 మంది కంటెస్టెంట్స్‌తో ప్రారంభమైన ఈ ఆట 40వ ఎపిసోడ్‌కి చేరుకునే సరికి హౌస్‌లో 14 మంది మిగిలారు. వరుసగా సరయు, ఉమాదేవి, లహరి, నటరాజ్ మాస్టర్, హమీదాలు ఇప్పటికే ఎలిమినేటి అయ్యారు. ఇక ఆరోవారం ఎలిమినేషన్స్‌కి సంబంధించి ఏకంగా పది మంది నామినేట్ అయ్యారు. శ్రీరామ్ చంద్ర, సిరి, లోబో, విశ్వ, షణ్ముఖ్ జస్వంత్, ప్రియాంక, యాంకర్ రవి, జెస్సీ, శ్వేతా, సన్నీ.. ఈ పది మంది నామినేషన్స్‌లో ఉన్నారు.

పాపులారిటీ పరంగా, వాళ్ళకి వచ్చే ఓట్ల పరంగా చూసి షణ్ముఖ్ జస్వంత్, యాంకర్ రవి, సన్నీలు, సిరి లు ఇప్పట్లో ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ లేదు. హమీదా వెళ్లిపోవడంతో శ్రీరామ్ చంద్ర గేమ్ మీద ఫోకస్ పెట్టడంతో ఈ వారం సేవ్ అయిపోయాడు. ఇంకా జెస్సీని అమాయకుడు అనుకుంటున్నారు దీంతో జెస్సి కూడా సేవ్ అయ్యాడు. ప్రియాంకకి సింపతీ ఓట్లు బాగానే పడుతుండటంతో సేవ్ అయిపొయింది. మానస్ ఈవారం నామినేషన్స్‌లో లేకపోవడంతో అతని ఓట్లు కూడా ప్రియాంకకి పడే ఛాన్స్ ఉండటం వల్ల ప్రియాంక సేవ్ అయింది. విశ్వ కెప్టెన్ అవ్వడం వల్ల ఎలిమినేటి అయ్యే అవకాశం అసలు లేదు.

Meelo Evaru koteeswarulu : స్టార్ మ్యూజిక్ డైరెక్టర్స్ తో ఎవరు మీలో కోటీశ్వరులు స్పెషల్ ఎపిసోడ్

ఇక శ్వేతా, లోబోల మధ్య గట్టిగానే పోటీ జరిగినట్టు ఉంది. లోబో మీద నెగిటివిటి ఉన్నా సేవ్ అవుతూ వస్తున్నాడు. ఈ సారి కూడా అలాగే సేవ్ అయ్యాడు. యాంకర్ రవి అభిమానుల ఓట్లు కూడా లోబోకి పడుతుండటం వల్ల లోబో సేవ్ అయ్యాడు. దీంతో ఈ వారం శ్వేతా ఎలిమినేట్ అయింది. శ్వేతాకి బిగ్ బాస్ కి రాకముందు కూడా పెద్దగా క్రేజ్ లేదు. బిగ్ బాస్‌ లో కూడా అంతగా తనని ప్రూవ్ చేసుకోలేదు. తాజాగా అందరూ తనకి వరస్ట్ పర్ఫార్మర్ స్టాంప్ ఇవ్వడం , తాను జైలు కి వెళ్లడం ఇవన్నీ కాకుండా ఇన్ని రోజులు శ్వేతా నామినేషన్స్‌లోకి రాకపోవడం వల్ల సేవ్ అయింది. ఈ సారి నామినేషన్స్ లో ఉండటంతో ఎలిమినేట్ అయిపోయింది.

మరి శ్వేతా బయటకి వచ్చి కంటెస్టెంట్స్ గురించి ఏం చెప్తుందో చూడాలి. నెక్స్ట్ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారో అని ఇప్పట్నుంచే జనాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.