Bigg Boss 5 : జైలుకి వెళ్లిన శ్వేతవర్మ.. అందరి కంటే వరస్ట్ ఈమేనా??

వరస్ట్ పర్ఫర్మార్ ఎవరనే టాస్క్ ని ఇచ్చారు. ఈ టాస్క్ తో మరో సారి కంటెస్టెంట్స్ మధ్య ఉన్న విభేదాలు బయటకి వచ్చాయి. వరస్ట్ పర్ఫర్మార్ గా అందరికంటే ఎక్కువ స్టాంప్స్

Bigg Boss 5 :  జైలుకి వెళ్లిన శ్వేతవర్మ.. అందరి కంటే వరస్ట్ ఈమేనా??

Bb5 (1)

Bigg Boss 5 :  బిగ్ బాస్ సీజన్ 5 తెలుగు నిన్నటి ఎపిసోడ్ లో బిగ్ బాస్ ఇచ్చిన బడ్జెట్ టాస్క్ లో ఇంటి సభ్యులు అంతా పాల్గొన్నారు. కాజల్, విశ్వా, రవి, లోబో, శ్వేతవర్మలు బడ్జెట్ టాస్క్ లో గెలిచారు. ఆ తరువాత వరస్ట్ పర్ఫర్మార్ ఎవరనే టాస్క్ ని ఇచ్చారు. ఈ టాస్క్ తో మరో సారి కంటెస్టెంట్స్ మధ్య ఉన్న విభేదాలు బయటకి వచ్చాయి.

ఈ టాస్క్ లో భాగంగా అందరికి వైట్ షర్ట్స్ ఇచ్చాడు బిగ్ బాస్. వరస్ట్ అనే స్టాంప్ ని రెడ్ పెయింట్ తో తీసుకొని హౌస్ లో ఉన్న సభ్యులంతా ఎవరు ఎవరికి వరస్ట్ అనిపించారో వాళ్ళకి ఆ స్టాంప్ వేయాలి. ముందుగా కెప్టెన్ విశ్వ రవి సరిగ్గా రూల్స్ పాటించట్లేదు, రూల్స్ బ్రేక్ చేస్తున్నాడంటూ రవి పై వరస్ట్ స్టాంప్ వేశాడు. దీంతో రవి సీరియస్ అయి నేను రూల్స్ బ్రేక్ చేస్తే నీకేమన్నా ప్రాబ్లమ్ వచ్చిందా అని అడిగాడు. కాజల్ కూడా రవిని టార్గెట్ చేసి నీ వల్ల బిగ్ బాస్ నన్ను తిట్టాడు కాబట్టి నీకే వరస్ట్ ఇస్తాను అని రవిపై స్టాంప్ వేసింది. ఇక రవి ఈ వారం జెస్సి అసలు ఆడలేదు అని జెస్సి షర్ట్ కి వరస్ట్ స్టాంప్ వేశాడు. జెస్సి నవ్వుకుంటూనే అది నా ప్రాబ్లమ్ కాదు మీ ప్రాబ్లమ్ అని సెటైర్ వేశాడు. సన్నీ సిరిని టార్గెట్ చేసి బిహేవియర్ నచ్చలేదంటూ, యాటిట్యూడ్ నచ్చలేదంటూ వరస్ట్ స్టాంప్ ఇచ్చారు. మానస్ కూడా సిరికే వరస్ట్ స్టాంప్ వేశాడు. అనీ మాస్టర్, సిరి, జెస్సిలు లోబోకి వరస్ట్ స్టాంప్ ఇచ్చారు. శ్రీరామ్ చంద్ర అనీ మాస్టర్ కి వరస్ట్ స్టాంప్ ఇవ్వగా, ప్రియాంక సింగ్ , ప్రియా, షణ్ముఖ్ జశ్వంత్, లోబోలు టార్గెట్ చేసి శ్వేతా వర్మకి వరస్ట్ స్టాంప్ వేశారు.

Allu Arjun : శ్రీ చైతన్య యాడ్ లో అల్లు అర్జున్.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు

వరస్ట్ పర్ఫర్మార్ గా అందరికంటే ఎక్కువ స్టాంప్స్ శ్వేత వర్మకి రావడంతో బిగ్ బాస్ ఆమెని బిగ్ బాస్ జైలుకి పంపిస్తాడు. ఆ తరువాత అనీ మాస్టర్ శ్వేత వర్మ జైలుకి వెళ్లిందని బాధపడటంతో ఆ విషయాన్ని సన్నీ శ్వేతవర్మకి చెప్తాడు. షణ్ముఖ్ జశ్వంత్ వచ్చి అనీ మాస్టర్ కెప్టెన్సీ టాస్క్ సమయంలో శ్వేత వర్మ అసలు తన కూతురు లాంటిదే కాదు, నాకు బిగ్ బాస్ హౌస్ లో ఎలాంటి రిలేషన్స్ వద్దు అంటూ చెప్పిన మాటలు శ్వేతవర్మకి చెప్పడంతో జైలు నుండి బైటికి వచ్చిన తరువాత మా మధ్య ఉన్న గొడవను క్లారిఫై చేసుకుంటానని చెప్పింది.