సైరా – జ్యూక్ బాక్స్

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా.. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘సైరా నరసింహారెడ్డి’ పాటలు విడుదల..

  • Published By: sekhar ,Published On : October 1, 2019 / 04:55 AM IST
సైరా – జ్యూక్ బాక్స్

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా.. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘సైరా నరసింహారెడ్డి’ పాటలు విడుదల..

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన హిస్టారికల్ మూవీ.. సైరా నరసింహారెడ్డి.. మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అమితాబ్ బచ్చన్, నయనతార, తమన్నా, జగపతిబాబు, సుదీప్, విజయ్ సేతుపతి తదితరులు కీలక పాత్రల్లో నటించగా.. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో, కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్‌పై, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ భారీ బడ్జెట్‌తో నిర్మించిన సైరా ఆడియో సాంగ్స్ ఆన్‌లైన్‌లో రిలీజ్ చేశారు. 

ఈ ఆల్బమ్‌లో మొత్తం నాలుగు పాటలున్నాయి. సిరివెన్నెల రాసిన ‘జాగోరే నరసింహా జాగోరే’ పాటతో ఈ ఆల్బమ్ స్టార్ట్ అవుతుంది. శంకర్ మహదేవన్, హరిచరణ్, అనురాగ్ కులకర్ణి పాడారు. ‘సైరా’ టైటిల్ సాంగ్ సిరివెన్నెల రాయగా, శ్రేయా ఘోషల్, సునిధి చౌహన్ పాడారు. ‘అందం అంకితం.. ప్రాణం అర్పితం’ అనే పాటను అనంత శ్రీరామ్ రాయగా.. విజయ్ ప్రకాష్, షాషా తిరుపతి పాడారు. ‘శ్వాసలోన దేశమే’ పాటను చంద్రబోస్ రాయగా.. హరిచరణ్ పాడారు..

Red Also : గద్దలకొండ గణేష్ – 10 రోజుల షేర్..

అక్టోబర్ 2న తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ భాషల్లో ‘సైరా’  భారీగా విడుదల కానుంది. సంగీతం : అమిత్ త్రివేది, కెమెరా : రత్నవేలు, ఎడిటింగ్ : ఎ.శ్రీకర్ ప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్ : రాజీవన్ నంబియార్, విఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ : కమల్ కణ్ణన్.