మిథాలీ బయోపిక్: తాప్సీ ప్రధాన పాత్రలో!

  • Edited By: vamsi , December 3, 2019 / 09:01 AM IST
మిథాలీ బయోపిక్: తాప్సీ ప్రధాన పాత్రలో!
ad

బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు.. ప్రతీ ఇండస్ట్రీలో ఇప్పుడు బయోపిక్‌ల హవా నడుస్తుంది. డైరెక్టర్లు అందరూ బయోపిక్‌లు తీయడంలో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే లేటెస్ట్‌గా ఇండియన్ ఉమెన్ టీమ్ కెప్టెన్‌గా రాణించిన మిథాలీ రాజ్ బయోపిక్ తీసేందుకు దర్శక నిర్మాతలు ప్లాన్ చేసుకుంటున్నారు.

ప్రపంచ మహిళా క్రికెట్‌లోనే అత్యధిక పరుగులు చేసిన క్రికెట‌ర్ మిథాలీ రాజ్ జీవిత చరిత్రను వెండితెరపై ఆవిష్కరించాలని నిర్ణయించుకుంది వ‌యాకామ్ 18 సంస్థ.

‘శభాష్‌ మిథూ’ పేరుతో రాయీస్ ఫేమ్ రాహుల్ దొలాకియా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మిథాలీ పాత్రలో నటించేందుకు తాప్సీ పన్నుని ఎంచుకున్నట్టుగా అఫీషియల్‌గా ప్రకటించింది చిత్ర యూనిట్‌. అంతేకాదు.. అతి త్వరలో సినిమాను సెట్స్‌ పైకి తీసుకెళ్లుతున్నట్లు కూడా తెలిపారు మూవీ మేకర్స్‌.

మిథాలీ రాజ్ పుట్టినరోజు సంధర్భంగా చిత్ర యూనిట్ ఈ విషయాన్ని వెల్లడించింది. సుదీర్ఘకాలం ఇండియాకు ప్రాతినిథ్యం వహించి ఇటీవలే..  టీ 20ల‌కి గుడ్ బై చెప్పిన మిథాలీ రాజ్ పాత్రలో నటిస్తుంది.