అల్లు అర్జున్ సినిమాలో వీళ్ళిద్దరూ..

అల్లు అర్జున్ సినిమాలో మలయాళ నటుడు జయరామ్..

  • Published By: sekhar ,Published On : April 20, 2019 / 05:30 AM IST
అల్లు అర్జున్ సినిమాలో వీళ్ళిద్దరూ..

అల్లు అర్జున్ సినిమాలో మలయాళ నటుడు జయరామ్..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో రూపొందబోయే సినిమా ఇటీవలే పూజాకార్యక్రమాలు జరుపుకున్న సంగతి తెలిసిందే. ఎస్.రాధాకృష్ణ(చినబాబు), అల్లు అరవింద్ కలిసి నిర్మిస్తుండగా, పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించనుంది. బన్నీ, త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కనున్న ఈ మూవీకి ముందుగా, నాన్న-నేను అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు వార్తాలొచ్చాయి.. త్రివిక్రమ్ అ సెంటిమెంట్ ప్రకారం ‘అలకనంద’ అనే టైటిల్ ఫిక్స్ చేసారని తెలుస్తుంది.

ఈ మూవీలో ఒక ఇంపార్టెంట్ రోల్ కోసం ప్రముఖ మలయాళ నటుడు జయరామ్ని సంప్రదించారని, ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ఫిలింనగర్ వర్గాల సమాచారం. అల్లు అర్జున్ తల్లి పాత్రలో అలనాటి అందాల తార టబు నటించనుంది. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.  జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి తర్వాత, అల్లు అర్జున్, త్రివిక్రమ్ కలిసి చేస్తున్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలున్నాయి. ఏప్రిల్ 24 నుండి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది.