Tamannah: ప్రేమించుకుంటున్నారా..? సిరీస్ కోసమే క‌లిసి ప్ర‌యాణ‌మా..?

మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా(Tamannah)ను ప‌రిచ‌యం చేయాల్సిన ప‌ని లేదు. తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగా ద‌గ్గ‌రైన హీరోయిన్ల‌లో ఆమె ఒక‌రు. ప్ర‌స్తుతం ఆమె బాలీవుడ్ పైనే ఎక్కువ‌గా దృష్టి పెట్టింది. అయితే.. ఈ భామ గ‌త కొద్ది రోజులుగా ఓ బాలీవుడ్ న‌టుడితో ప్రేమ‌లో ఉంద‌నే వార్త‌లు వినిపిస్తున్న సంగ‌తి తెలిసిందే.

Tamannah: ప్రేమించుకుంటున్నారా..?  సిరీస్ కోసమే క‌లిసి ప్ర‌యాణ‌మా..?

Tamannah-Vijay Varma

Tamannah-Vijay Varma: మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా(Tamannah)ను ప‌రిచ‌యం చేయాల్సిన ప‌ని లేదు. తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగా ద‌గ్గ‌రైన హీరోయిన్ల‌లో ఆమె ఒక‌రు. ప్ర‌స్తుతం ఆమె బాలీవుడ్ పైనే ఎక్కువ‌గా దృష్టి పెట్టింది. అయితే.. ఈ భామ గ‌త కొద్ది రోజులుగా ఓ బాలీవుడ్ న‌టుడితో ప్రేమ‌లో ఉంద‌నే వార్త‌లు వినిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. అత‌డు మ‌రెవ‌రో కాదు విజ‌య్ వ‌ర్మ‌(Vijay Varma). తెలుగులో నాని హీరోగా న‌టించిన ‘ఎంసీఏ’ చిత్రంలో విల‌న్‌గా న‌టించాడు.

ఇక వీరిద్ద‌రు చెట్టాప‌ట్టాలేసుకున్న తిరుగుతుండ‌గా ప‌లు మార్లు మీడియా కంటికి కూడా చిక్కారు. దీంతో వీరిద్ద‌రి మ‌ధ్య సంథింగ్‌, సంథింగ్ అంటూ వ‌స్తున్న వార్త‌ల‌కు బ‌లం చేకూరిన‌ట్లైంది. అటు వీటిపై త‌మ‌న్నా కానీ, ఇటు విజ‌య్ వ‌ర్మ కానీ పెద్ద‌గా స్పందించ‌క‌పోవ‌డంతో వీరిద్ద‌రి మ‌ధ్య‌న ఏదో ఉంద‌ని దాదాపుగా అది నిజ‌మేన‌ని అంద‌రూ న‌మ్ముతున్నారు.

Lust Stories 2 : లస్ట్ స్టోరీస్ 2 టీజర్ రిలీజ్.. ఈ సారి అంతకు మించి.. తమన్నా, మృణాల్, కాజోల్ తో గట్టిగానే ప్లాన్ చేశారుగా..

కాగా.. గ‌తంలో న్యూ ఇయ‌ర్ పార్టీలో వీరిద్ద‌రు లిప్ కిస్ పెట్టుకున్న ఓ వీడియో సంచ‌ల‌నం సృష్టించిన సంగ‌తి తెలిసిందే. అప్ప‌టి నుంచి వీరిద్ద‌రి ప్రేమ వార్త‌లు బీ టౌన్‌లో హాట్ టాఫిక్ గా మారాయి. అయితే ఇండ‌స్ట్రీలోని కొంత మంది మాత్రం వీరిద్ద‌రు క‌లిసి ‘ల‌స్ట్ స్టోరీస్ 2’ వెబ్ సిరీస్‌లో న‌టిస్తున్నార‌ని అంత‌కు మించి మ‌రేం లేద‌ని చెప్పుకుంటూ వ‌చ్చారు.

తాజాగా ‘ల‌స్ట్ స్టోరీస్ 2’ వెబ్ సిరీస్ టీజ‌ర్ విడుద‌లైంది. మృణాల్ ఠాకూర్, కాజోల్, నీనా గుప్తా, అమృత సుభాష్, అంగద్ బేడీ వంటి స్టార్స్ న‌టించిన‌ప్ప‌టికి అంద‌రి దృష్టి మాత్రం ఓ ఇద్ద‌రిపైనే ప‌డింది. ఆ ఇద్ద‌రే త‌మ‌న్నా, విజ‌య్ వ‌ర్మ‌. ఈ టీజర్‌లో త‌మ‌న్నా నుదిటిపై విజ‌య్ వ‌ర్మ ముద్దు పెట్టిన క్లిప్ వైర‌ల్‌గా మారింది. దీంతో ఈ సిరీస్‌లో వీరిద్ద‌రి మ‌ధ్య ఇంకా ఎలాంటి స‌న్నివేశాలు ఉంటాయ‌నే దానిపై అభిమానుల్లో ఆస‌క్తి నెల‌కొంది.

Anantha : మనిషి పుట్టిన మరుక్షణం నుంచే ఆ శరీరం మరణం వైపు ప్రయాణిస్తుంది.. అనంత ట్రైలర్ రిలీజ్..

కాగా.. వీరిద్ద‌రు నిజంగానే ప్రేమించుకున్నారా..? లేక ఈ సిరీస్ కోసం క‌లిసి ప్ర‌యాణం చేశారా..? అన్న ప్ర‌శ్న మొద‌లైంది.