Tamanna : అనసూయ షోకి లీగల్ నోటీసులు పంపిన తమన్నా

త‌మ‌న్నా స్థానంలో అన‌సూయ‌ని తీసుకొస్తే షోకి రేటింగ్ వస్తుందని భావించారు నిర్వాహకులు. అయితే తాజాగా `మాస్టర్‌ చెఫ్‌ తెలుగు` షో నిర్వహిస్తున్న ప్రొడక్షన్ హౌస్‌కు తమన్నా షాకిచ్చింది.

Tamanna : అనసూయ షోకి లీగల్ నోటీసులు పంపిన తమన్నా

Tamanna (1)

Tamanna : ఇన్నాళ్లు హీరోయిన్‌గా అల‌రించిన తమన్నా ఇటీవల తొలిసారి యాంకర్ గా ఓ షోకి వ్యవహరించింది. తమన్నా యాంకర్ గా వ్యవహరించిన షో `మాస్టర్‌ చెఫ్‌ తెలుగు`. రకరకాల కొత్త వంటలను పరిచయం చేస్తూ కుకింగ్‌ లో కాంపిటేషన్ పెట్టే షో ఇది. జెమిని టీవిలో ప్రసారమయ్యే ఈ షోకి ఇన్నాళ్లు తమన్నా హోస్ట్‌గా వ్యవహరించింది. తాజాగా ఆమె స్థానంలో అనసూయను తీసుకొచ్చారు షో నిర్వాహకులు. అయితే తమన్నా హోస్ట్ చేసే ఈ షోకి అంతగా పాపులారిటీ, రేటింగ్‌ రావట్లేదని సమాచారం. కాని తమన్నా వెళ్లిపోయిందా? లేక వేరే సినిమా షూట్స్ వల్ల బిజీగా ఉందా? నిర్వాహకులే తమన్నాని తప్పించారా అనే కారణం తెలియదు. దీంతో బుల్లితెరపై అందం చూపిస్తూ హోస్ట్ గా కూడా అదరగొట్టే అనసూయని ఈ షో కోసం తీసుకొచ్చారు.

F3 Movie : మహా శివరాత్రికి నవ్వించడానికి వస్తున్న ‘ఎఫ్ 3’

అన‌సూయ‌ని తీసుకొస్తే షోకి రేటింగ్ కూడా బాగా వస్తుందని భావించారు నిర్వాహకులు. అయితే తాజాగా `మాస్టర్‌ చెఫ్‌ తెలుగు` షో నిర్వహిస్తున్న ప్రొడక్షన్ హౌస్‌కు తమన్నా షాకిచ్చింది. త‌నను తొలగించడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న త‌మ‌న్నా ఈ షో ప్రొడక్షన్ హౌస్ ఇన్నోవేటివ్ ఫిల్మ్ అకాడమీపై తన లాయర్ చేత నోటీసులు పంపించిందని సమాచారం. తనకు ఆ షో నుంచి రావాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలని ప్రొడక్షన్ హౌస్‌కు నోటీసులు పంపినట్లు తెల్సుతుంది. ఈ నోటీసులపై ప్రొడక్షన్ హౌస్ ఎలా స్పందిస్తుందో చూడాలి. తమన్నా వెళ్లిపోవడంతో అనసూయకి కలిసొచ్చింది అని అంటున్నారు ప్రేక్షకులు. మరి అనసూయ తన అందచందాలతో తన యాంకరింగ్ తో షోకి ఏ రేంజ్ హైప్ తెస్తుందో చూడాలి.