Tamannaah: బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో తగ్గేది లేదంటున్న తమన్నా!

పోయిన చోటే వెతుక్కుంటోంది తమన్నా. సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ఒకప్పుడు ఫుల్ బిజీగా ఉన్న తమన్నా.. ఆ మధ్య కాస్త స్లో అయినా .. మళ్లీ పికప్ అవ్వడానికి వచ్చిన ప్రతి ఛాన్స్..

Tamannaah: బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో తగ్గేది లేదంటున్న తమన్నా!

Tamannaah

Tamannaah: పోయిన చోటే వెతుక్కుంటోంది తమన్నా. సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ఒకప్పుడు ఫుల్ బిజీగా ఉన్న తమన్నా.. ఆ మధ్య కాస్త స్లో అయినా .. మళ్లీ పికప్ అవ్వడానికి వచ్చిన ప్రతి ఛాన్స్ నీ యూజ్ చేసుకుంది. ఇటు స్మాల్ స్క్రీన్ లో బిజీగా ఉంటూనే సినిమాల్లో కూడా బాగా హడావిడిచేస్తోంది. ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా సౌత్ లో సూపర్ సక్సెస్ అయిన తమన్నా ఒక వైపు స్మాల్ స్క్రీన్ లో ఫుల్ బిజీగా ఉంటూనే సినిమాల్లో కూడా హడావిడి చేస్తోంది. అసలు ఖాళీ లేకుండా సిరీస్ లు చేస్తూనే సినిమాల్లో కూడా ఫుల్ బిజీ అయిపోయింది.

Big Boss 5: ఏడుగురిని గొర్రెలుగా చేసిన హౌస్‌లోకి వచ్చిన ఓ గుంట నక్క!

లేటెస్ట్ గా రిలీజ్ అయిన సీటీమార్ లో జ్వాలా రెడ్డిగా కొత్తగా కనిపించి తమన్నా మళ్లీ కమ్ బ్యాక్ అయ్యింది. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో బిజీ అయ్యింది. తమన్నా ప్రజెంట్ సీటీమార్ సక్సెస్ ఎంజాయ్ చేస్తోంది. అంతేకాదు ..తన అప్ కమింగ్ మూవీ మ్యాస్ట్రో ప్రమోషన్స్ తో సందడి చేస్తోంది. మేర్లపాక గాంధీ డైరెక్షన్లో నితిన్, నభానటేష్, లీడ్ రోల్స్ లో బాలీవుడ్ మూవీ అంధాదున్ రీమేక్ గా వస్తున్న మ్యాస్ట్రోలో ఇంట్రస్టింగ్ రోల్ చేస్తోంది మిల్కీ బ్యూటీ. కంప్లీట్ క్యారక్టర్సే కాకుండా స్పెషల్ సాంగ్స్ తో కూడా సందడి చేస్తోంది తమన్నా.

PV Sindhu Biopic: దీపికా మరో క్రేజీ ఫిల్మ్.. సిల్వర్ స్క్రీన్ మీద సింధు సక్సెస్ స్టోరీ!

మ్యాస్ట్రోతో పాటు కెరీర్ లో సూపర్ హిట్ అయిన ఎఫ్ 2 సీక్వెల్ రిలీజ్ కోసం వెయిట్ చేస్తోంది తమన్నా. అనిల్ రావిపూడి డైరెక్షన్లో వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా తమన్నా, మెహరీన్ హీరోయిన్లుగా వచ్చి సూపర్ హిట్ అయిన ఎఫ్ 2కి సీక్వెల్ గా వస్తోంది ఎఫ్ 3. షూటింగ్ అయిపోయి పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్న ఈ సినిమా సంక్రాంతి రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ మూడు సినిమాలే కాకుండా సత్యదేవ్ తో గుర్తుందా సీతాకాలం, లేడీ ఓరియెంటెడ్ మూవీ దట్ ఈజ్ మహాలక్ష్మితో పాటు బాలీవుడ్ లో మరో రెండు సినిమాలు చేస్తోంది. ఇలా చేతి నిండా సినిమాలతో తెగ హడావిడి చేస్తోంది తమన్నా.