హింసనేదే ఉండదు.. ప్రతి సీన్ గన్‌లా పేలుతుంది – ప్రవీణ్ సత్తారు

  • Published By: madhu ,Published On : November 9, 2020 / 01:47 PM IST
హింసనేదే ఉండదు.. ప్రతి సీన్ గన్‌లా పేలుతుంది – ప్రవీణ్ సత్తారు

Tamannaah Bhatia Press Meet : టాలీవుడ్ నటి తమన్నా నటిస్తున్న వెబ్ సిరీస్ 11th Hour. ఈ సినిమాలో హింసనేది ఉండదని, ప్రతి సీన్ గన్‌లా పేలుతుందని అన్నారు దర్శకుడు ప్రవీణ్ సత్తారు. గుంటూరు టాకీస్, గరుడ వేగ వంటి విభిన్నమైన సినిమాలతో ఆకట్టుకున్న ప్రవీణ్ సత్తారు ఈ వెబ్ సీరీస్‌కు దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఈ 11th Hour సినిమాకు సంబంధించిన పోస్టర్‌ను లేటెస్ట్‌గా ఆవిష్కరించింది చిత్రయూనిట్.



ఈ సందర్భంగా ప్రవీణ్ సత్తారు మాట్లాడుతూ.. పరుగెత్తడాలు..ఛేజింగ్ లు ఈ సినిమాలో ఉండవని, కూర్చొంటారు..మాట్లాడుకుంటారు..కానీ..థ్రిల్లర్ లా మాత్రం ఉంటుందని అన్నారు. ప్రాజెక్టు చేపట్టిన నాటి నుంచి..స్పీడ్ గా షూటింగ్ కు వెళ్లడానికి కారణం..ఆహా(aha team)..టీం అన్నారు. తమకు ఫ్రీడం  ఇచ్చారని అన్నారు. మనస్పూర్తిగా తాము ఈ ప్రాజెక్టు చేసినట్లుగా చెప్పుకొచ్చారు. ఒక హోటల్ లో ఒక రాత్రి ..ఎన్ని బ్లాక్ లు పెట్టగలం ? కానీ..కొత్త కొత్తగా చూపించగలిగామన్నారు. సిరీస్ అంతా తమన్నా భుజాలపై ఉందన్నారు ప్రవీణ్.



ప్రస్తుతం డిజిటల్ ప్లాట్ ఫాం కు ఫుల్ డిమాండ్ ఉంది. కరోనా కారణంగా థియేటర్లన్నీ మూతపడ్డాయి. దీంతో సినీ అభిమానులు ఓటీటీని ఎంచుకున్నారు. అందులో వచ్చే సినిమాలను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. పలు సంస్థలు వెబ్ సిరీస్ లను రూపొందిస్తున్నాయి. ఈ క్రమంలో వీటికి డిమాండ్ ఏర్పడింది. కొంతమంది స్టార్స్ కూడా వెబ్ సిరీస్ లను ఎంచుకుంటున్నారు. తాజాగా మిల్కీ బ్యూటీ తమన్నా..కూడా వెబ్ సిరీస్ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. థ్రిల్లర్ జోనర్ లో ఈ వెబ్ సీరీస్ 8 పార్ట్ లుగా రూపొందుతుందని తెలుస్తోంది.