BiggBoss 6: “కళ్యాణ్-శ్రీసత్య”ల మధ్య ఏదో ఉంది అంటున్న తమన్నా..

బిగ్‌బాస్ సీజన్ 6 మొదటి నుంచే ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తూ కంటెస్టెంట్స్ నే కాదు, ఆడియన్స్ ని కూడా ఆశ్చర్యపరుస్తుంది. ఈ క్రమంలో శనివారం హౌస్ నుంచి షాని ఎలిమినేట్ కాగా, ఈరోజు మరో కంటెస్టెంట్ ఎలిమినేట్ కాబోతున్నాడు. బిగ్‌బాస్ నిర్వహకులు నేటి ప్రోమోని విడుదల చేయగా, ప్రోమో మొత్తం ఫుల్ ఫన్ తో సాగిపోయింది. ఈరోజు హౌస్ లోకి తమన్నా రాబోతుంది. ఆమె నటించిన "బబ్లీ బౌన్సర్" సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నేడు బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ తో...

BiggBoss 6: “కళ్యాణ్-శ్రీసత్య”ల మధ్య ఏదో ఉంది అంటున్న తమన్నా..

Tamannaah Entered in BiggBoss House for Babli Bouncer Promotions

BiggBoss 6: బిగ్‌బాస్ సీజన్ 6 మొదటి నుంచే ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తూ కంటెస్టెంట్స్ నే కాదు, ఆడియన్స్ ని కూడా ఆశ్చర్యపరుస్తుంది. మొదటివారం ఎలిమినేషన్ తీసేసిన బిగ్‌బాస్, రెండోవారం డబల్ ఎలిమేషన్ పెట్టి కంటెస్టెంట్స్ కి షాక్ ఇచ్చాడు. ఈ క్రమంలో శనివారం హౌస్ నుంచి షాని ఎలిమినేట్ కాగా, ఈరోజు మరో కంటెస్టెంట్ ఎలిమినేట్ కాబోతున్నాడు.

BiggBoss 6 Day 13 : బిగ్‌బాస్ సీజన్ 6.. ట్విస్టుల మీద ట్విస్టులు.. ఈ సారి డబల్ నామినేషన్.. కంటెస్టెంట్స్ మీద ఫైర్ అయిన నాగ్..

బిగ్‌బాస్ నిర్వహకులు నేటి ప్రోమోని విడుదల చేయగా, ప్రోమో మొత్తం ఫుల్ ఫన్ తో సాగిపోయింది. ఈరోజు హౌస్ లోకి తమన్నా రాబోతుంది. ఆమె నటించిన “బబ్లీ బౌన్సర్” సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నేడు బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ తో కలిసి సందడి చేయనుంది. ఇందులో భాగంగా బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ కి ‘తమన్నా కానుక’ అని ఒక టాస్క్ ఇచ్చాడు.

ఇంటిలో ఉన్న ప్రతి బాయ్ హౌస్ లో ఉన్న లేడీస్ నుంచి ఒక బౌన్సర్ ని ఎన్నుకోమనగా.. చంటి, ఫైమా ని ఎన్నుకుంటూ, అందుకుగల కారణం చెప్పడంతో ఫుల్ ఫన్ జనరేట్ అయ్యింది. ఇక అర్జున్ కళ్యాణ్ కూడా తనకు బౌన్సర్ గా శ్రీసత్య ని ఎన్నుకుంటున్నట్టు చెప్పగానే ఆడియన్స్ నుంచి ఒక్కసారిగా కేకలు వినిపించాయి.

ఆ కేకలు ఎందుకో చెపుతారా అని నాగార్జున అడగా, వారి ఇద్దరి మధ్య ఏదో ఉంది అంటూ బదులిచ్చారు ఆడియన్స్. అందుకు కళ్యాణ్ మా మధ్య ఏమి లేదు, మేము ఫ్రెండ్స్ మాత్రమే అంటూ చెప్పుకొచ్చాడు. ప్రేమ పుట్టేది కూడా ఫ్రెండ్ షిప్ నుంచే అంటూ తమన్నా కళ్యాణ్ కి కౌంటర్ ఇచ్చింది. అయితే ప్రతి సీజన్లో ఎవరో ఒకరి మధ్య ఇలాంటి రుమౌర్స్ క్రియేట్ చేసి క్యాష్ చేసుకునే బిగ్‌బాస్ నిర్వహకులు, ఈసారి అర్జున్ కళ్యాణ్-శ్రీసత్య లను అందుకు ఉపయోగించుకుంటున్నట్టు తెలుస్తుంది. మరి ఇవాళ ఎవరు హౌస్ నుంచి వెళ్ళబోతున్నారో అన్నది చూడాలి.