Tamannaah : నార్త్ ఫ్యాన్స్ కంటే సౌత్ ఫ్యాన్స్ గొప్ప అంటున్న మిల్కీ బ్యూటీ..

తమన్నా ఓ న్యూస్ పోర్టల్ తో మాట్లాడుతూ.. ''సౌత్ ఇండియాలో అభిమానులు, ఆర్టిస్ట్ ల మనోభావాలను అర్థం చేసుకుంటారు. ఆర్టిస్టులను అమితంగా అభిమానిస్తారు. ఉత్తరాది................

Tamannaah : నార్త్ ఫ్యాన్స్ కంటే సౌత్ ఫ్యాన్స్ గొప్ప అంటున్న మిల్కీ బ్యూటీ..

Tamannaah

Tamannaah :  చిన్నా పెద్దా హీరోలన్న తేడా లేకుండా అందరు హీరోలతో సినిమాలు చేసే టాప్ హీరోయిన్ తమన్నా. ఆ మధ్య ఓటీటీలో సిరీస్ లు కూడా చేసింది. ప్రస్తుతం తమన్నా తెలుగు, తమిళంతో పాటు హిందీలో కూడా కొన్ని ప్రాజెక్టులు చేస్తోంది. ఈ మధ్యే ఓ న్యూస్ పోర్టల్ తో మాట్లాడుతూ సౌత్ అభిమానులకు, నార్త్ అభిమానులకు మధ్య వ్యత్యాసం కుండ బద్ధలు కొట్టినట్టు చెప్పేసింది మిల్కీ బ్యూటీ.

ఇటీవలే తమన్నా వెంకటేష్ సరనసన నటించిన ఎఫ్3 రిలీజ్ అయింది. ఎఫ్ 2కి సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమాలో తమన్నా పెర్ఫామెన్స్ కి ఫ్యాన్స్ నుంచి బిగ్ అప్లాజ్ వచ్చింది. ఇంకా మెగాస్టార్ సరసన భోళాశంకర్ లో నటిస్తోన్న తమన్నా, ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో దట్ ఈజ్ మహాలక్ష్మి, తమిళ్ లో కరుణాకరణ్ డైరెక్షన్ లో ఎన్ ఎంద్రు ఎంబెన్ తో పాటు, కుతు కురుప్పు సినిమాలు చేస్తుంది. ప్రస్తుతం బాలీవుడ్ లో భోలే చుడియాన్, అమర్ కౌశిక్ తో చోర్ నిఖల్ కి బాగే, మధుర్ బండర్కర్ తో బబ్లీ బౌన్స్ ర్ మూవీస్ తమన్నా అప్ కమింగ్ మూవీస్ లిస్ట్ లో ఉన్నాయి.

Ranbir-Alia : పెళ్లి తర్వాత మరింత బిజీగా మారిన బాలీవుడ్ జంట..

తమన్నా ఓ న్యూస్ పోర్టల్ తో మాట్లాడుతూ.. ”సౌత్ ఇండియాలో అభిమానులు, ఆర్టిస్ట్ ల మనోభావాలను అర్థం చేసుకుంటారు. ఆర్టిస్టులను అమితంగా అభిమానిస్తారు. ఉత్తరాది అభిమానులు మాత్రం అంత డెప్త్ గా అభిమానం చూపించలేరు. స్టార్స్, ఫ్యాన్స్ మధ్య హెల్తీ రిలేషన్ షిప్ సౌత్ ఇండియాలోనే ఉంటుంది. ఇక స్టార్స్ ని ట్రోల్ చేయడంలో నార్త్ అభిమానులు ముందు ఉంటారు” అని తెలిపారు. దీంతో తమన్నా చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.