Nani: నానితో చిందులేస్తున్న తమన్నా.. నిజమేనా?

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం ‘దసరా’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాలో నాని ఊరమాస్ అవతారంలో కనిపిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో ఓ మాస్ మసాలా సాంగ్‌ను పెట్టేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోందట.

Nani: నానితో చిందులేస్తున్న తమన్నా.. నిజమేనా?

Tamannaah To Dance In Nani Movie

Nani: నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం ‘దసరా’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాలో నాని ఊరమాస్ అవతారంలో కనిపిస్తున్నాడు. ఇక ఈ సినిమాను తెలంగాణలోని సింగరేణి కోల్ మైన్స్ నేపథ్యంలో చిత్ర యూనిట్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా కథ ఎలా ఉండబోతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

Nani Dasara Movie:దసరాలో వెన్నెల చిందులు.. కీర్తి సురేష్‌కి నాని బర్త్ డే గిఫ్ట్..

ఇక ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్, ఫస్ట్ లిరికల్ సాంగ్ ఇప్పటికే రిలీజ్ అయ్యి ప్రేక్షకుల్లో ఈ సినిమాపై ఆసక్తిని రెట్టింపు చేశాయి. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో ఓ మాస్ మసాలా సాంగ్‌ను పెట్టేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోందట. అయితే ఈ పాటలో అందాల ఆరబోతతో పాటు అదిరిపోయే చిందులు వేసేందుకు మిల్కీ బ్యూటీ తమన్నాను తీసుకునేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోందట. ఈ మేరకు తమన్నాతో సంప్రదింపులు కూడా జరుపుతున్నారట.

Nani Dasara Movie: రిలీజ్‭కి ముందే 100 కోట్ల బిజినెస్ చేసిన నాని సినిమా!

అయితే ఒకవేళ తమన్నా ఓకే చెబితే, ఈ సాంగ్‌కు వచ్చే క్రేజ్ నెక్ట్స్ లెవెల్‌లో ఉంటుందని చిత్ర యూనిట్ భావిస్తుంది. మరి నాని సినిమాలో మాస్ మసాలా సాంగ్‌లో చిందులేసేందుకు తమన్నా ఓకే చెబుతుందా లేదా అనేది చూడాలి. ఇక ఈ సినిమాలో అందాల భామ కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది.