RC15: రామ్‌చరణ్‌తోనే పోరుకు సిద్దమైన మిల్కీబ్యూటీ!

తమన్నా ఇండస్ట్రీకొచ్చి 16 ఏళ్ళైనా ఇప్పటికీ ఇంకా స్టార్ హీరోలకు జోడీ కడుతుంది. ఏకంగా రెండు తరాల హీరోలతో ఆడిపాడుతుంది.

RC15: రామ్‌చరణ్‌తోనే పోరుకు సిద్దమైన మిల్కీబ్యూటీ!

Rc15

RC15: తమన్నా ఇండస్ట్రీకొచ్చి 16 ఏళ్ళైనా ఇప్పటికీ ఇంకా స్టార్ హీరోలకు జోడీ కడుతుంది. ఏకంగా రెండు తరాల హీరోలతో ఆడిపాడుతుంది. టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు వరసపెట్టి కుర్రహీరోలతో కూడా రొమాన్స్ చేస్తుంది. ఒకవైపు నాలుగైదు సినిమాలు చేతిలో ఉండగానే ప్రస్తుత పరిస్థితిలో ఫుల్ డిమాండ్ ఉంటున్న వెబ్ సిరీస్ ల మీద కూడా ఫోకస్ చేస్తుంది. డిమాండ్ ఉంది కదా అని కేవలం హీరోయిన్ పాత్రలనే చేస్తా అని మడికట్టుకు కూర్చోవడం లేదు. సందీప్ కిషన్ లాంటి హీరోలతో రొమాన్స్ చేసినా స్టార్ హీరోలతో ఐటెం నంబర్స్ అయినా తమన్నా అన్నీ బ్యాలెన్స్ చేసుకుంటుంది.

కాలాన్ని బట్టి, డిమాండ్ ను బట్టి అన్నీ సమపాళ్ళలో మ్యానేజ్ చేసుకుంటున్న తమన్నా ఇప్పుడు మరో కీలకమైన నిర్ణయం తీసుకుంది. అదే రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోతో పోరుకు సిద్ధమైంది. ప్రస్తుతం మోస్ట్ అవెయిటెడ్ క్రేజీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్ లో నటిస్తున్న రామ్ చరణ్ ఆ తర్వాత తమిళ దర్శకుడు శంకర్ తో మరో పాన్ ఇండియా చేయనున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలు కాగా కియారా అద్వానీని హీరోయిన్ గా ఎంపిక చేశారు.

కాగా.. ఈ సినిమాలో మరో కీలకమైన పాత్ర కోసం తమన్నాను ఫైనల్ చేసినట్లుగా తెలుస్తుంది. ఇందులో మెయిన్ విలన్ భార్య పాత్ర హీరోతోనే తలపడాల్సి ఉంటుందట. అందుకే ఈ పాత్ర కోసం మరో హీరోయిన్ ను తీసుకొనే ఆలోచన చేసిన దర్శక, నిర్మాతలు తమన్నాను సంప్రదించగా వెంటనే ఒకే చెప్పేసినట్లు తెలుస్తుంది. కాగా, విలన్ గా కూడా బాలీవుడ్ హీరోను తీసుకోవాలని ప్రయత్నాలు చేస్తుండగా.. చరణ్ మేకోవర్ మీద కూడా ఇప్పటికే చర్చలు మొదలైనట్లు చెప్తున్నారు. మరి తమన్నా పాత్ర ఎలా ఉంటుందో తెలియాలంటే మాత్రం చాలా కాలం వేచి చూడాల్సిందే!