Thiagarajan : స్టార్ హీరోల సినిమాలకు దర్శకత్వం.. రోడ్డు మీద అనాధగా మరణం..

స్టార్ హీరోలతో సినిమాలు తీసిన తమిళ్ డైరెక్టర్ త్యాగరాజన్ నిన్న అనాధగా మరణించడం, పోలీసులు అనాధ శవంగా తీసుకెళ్లడంతో తమిళ సినీ పరిశ్రమ తీవ్ర దిగ్బ్రాంతి.......

Thiagarajan :  స్టార్ హీరోల సినిమాలకు దర్శకత్వం.. రోడ్డు మీద అనాధగా మరణం..

Tamil

Thiagarajan : :  స్టార్ హీరోలతో సినిమాలు తీసిన తమిళ్ డైరెక్టర్ త్యాగరాజన్ నిన్న అనాధగా మరణించడం, పోలీసులు అనాధ శవంగా తీసుకెళ్లడంతో తమిళ సినీ పరిశ్రమ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది. త్యాగరాజన్ అడయార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో శిక్షణ పొంది కొన్ని సినిమాలకు డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పని చేశారు. ఆ తర్వాత ‘పొన్ను పార్క పరేన్’ సినిమాతో డైరెక్టర్ గా పరిచయమయ్యారు. ఆ తర్వాత ప్రభు హీరోగా ‘వెట్రిమేల్ వెట్రి’ సినిమా తీశారు. తర్వాత అప్పటి తమిళ్ స్టార్ హీరో విజయ్‌కాంత్ హీరోగా ‘మానగర కావల్’ సినిమాను తెరకెక్కించారు.

Akhanda : అప్పన్న సన్నిధిలో ‘అఖండ’.. విశాఖలో విజయోత్సవ సభ

ఈ సినిమా 1991లో విడుదలై భారీ విజయం సాధించింది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ AVM నిర్మించింది. అయితే ఇది వాళ్లకు 150వ సినిమా. AVM లాంటి భారీ నిర్మాణ సంస్థలో 150వ సినిమా నిర్మించడం అంటే మామూలు విషయం కాదు. కానీ ఇప్పుడు అదే ఏవీఎం స్టూడియో సమీపంలో రోడ్డు పక్కన అనాథగా త్యాగరాజన్ చనిపోవడం కోలీవుడ్‌లో సంచలనం సృష్టిస్తుంది.

RRR: ఆర్ఆర్ఆర్ ట్రైలర్ వచ్చేసింది.. 11గంటలకు యూట్యూబ్‌లో!

‘మానగర కావల్’ విజయం తర్వాత కొన్ని కారణాల వల్ల అతనికి సినిమా ఆఫర్లు రాలేదు. దాంతో వేరే సినిమాలకు డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పని చేశారు. ఆ తర్వాత అవకాశాలు తగ్గిపోవడంతో సొంతూరు అరుంబుకోటైకి వెళ్లిపోయారు. అక్కడ ఒక యాక్సిడెంట్ కి గురయ్యి త్యాగరాజన్‌ కోమాలోకి వెళ్లారు. కోలుకున్న త‌ర్వాత మళ్ళీ చెన్నైకి తిరిగి వచ్చారు. ఆ తర్వాత ఏం చేయాలో అర్ధం కాక అక్కడే ఏవీఎం స్టూడియో సమీపంలో రోడ్డు పక్కనే పడుకుని, దగ్గర్లో ఉన్న అమ్మా క్యాంటీన్‌లో తింటూ చాలా దీన పరిస్థితి అనుభవించారు.

C.Kalyan : సినీ పరిశ్రమని చంపొద్దంటూ నిర్మాత సి.కళ్యాణ్ వ్యాఖ్యలు

నిన్న ఆయ‌న మరణించడంతో పోలీసులు అనాథ శవంగా భావించి మృతదేహాన్ని దగ్గర్లో ఉన్న ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ద‌ర్శ‌కుడిగా ఓ వెలుగు వెలిగి AVM సంస్థలో 150వ చిత్రానికి దర్శకత్వం వహించిన త్యాగరాజన్ ఇప్పుడు అదే సంస్థ బయట అనాథలా మరణించడం బాధాకరం. ఈయన గురించి తెలిసిన అప్పటి సినీ వ్యక్తులు త్యాగరాజన్ మృతికి సంతాపం తెలుపుతున్నారు.