Tamil Directors : తెలుగు ఇండస్ట్రీలో తమిళ్ డైరెక్టర్లు.. అందరూ హైదరాబాద్‌లోనే..

ఈ మధ్య కాలంలో తమిళ్ టాప్ డైరెక్టర్లందరూ హైదరాబాద్ రోడ్ల మీదే కనిపిస్తున్నారు..

Tamil Directors : తెలుగు ఇండస్ట్రీలో తమిళ్ డైరెక్టర్లు.. అందరూ హైదరాబాద్‌లోనే..

Tamil Directors

Tamil Directors: తెలుగు సినిమా ఇండస్ట్రీలో తమిళ్ డైరెక్టర్ల హడావిడి పెరిగిపోయింది. ఎప్పుడో ఒకటీ అరా తప్పించి మనవాళ్లు అక్కడికెళ్లడమే కానీ.. కోలీవుడ్ డైరెక్టర్లు టాలీవుడ్‌కి పెద్దగా వచ్చిందేలేదు. కానీ ఈ మధ్య కాలంలో తమిళ్ టాప్ డైరెక్టర్లందరూ హైదరాబాద్ రోడ్ల మీదే కనిపిస్తున్నారు.

టాలీవుడ్‌లో అరవగోల ఎక్కువైపోతోంది. పెద్దగా తెలుగు ఇండస్ట్రీకి రాని.. తమిళ్ డైరెక్టర్లు.. హైదరాబాద్‌లో ఎక్కడ చూసినా వాళ్లే కనిపిస్తున్నారు. తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్.. హైదరాబాద్‌లోనే హడావిడి చేస్తున్నారు. రామ్ చరణ్-శంకర్ కాంబినేషన్లో తెరకెక్కబోతున్న భారీ బడ్జెట్ మూవీకి సంబంధించిని స్టోరీ డిస్కషన్స్‌తో పాటు సినిమా లొకేషన్స్ కోసం భాగ్యనగరంలోనే చక్కర్లు కొడుతున్నారు శంకర్. అంతేకాదు.. రామ్ సినిమా లొకేషన్స్‌కి వెళ్లి సందడిచేశారు శంకర్.

ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా తమిళ్ డైరెక్టర్ లింగు స్వామి సినిమా మొదలుపెట్టారు. ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. రామ్ ‘రెడ్’ సినిమా తర్వాత సురేందర్ రెడ్డి, మారుతి.. ఇలా చాలా మంది డైరెక్టర్లతో సినిమా చేస్తున్నాడన్న టాక్ వినిపించినా.. తమిళ్ డైరెక్టర్ లింగు స్వామితోనే సినిమా ఓకే చేశారు.

‘13 బి’, ‘మనం’, ‘24’ లాంటి ఇంట్రెస్టింగ్ సినిమాలతో ఆడియన్స్‌కి దగ్గరైన విక్రమ్ కుమార్ కూడా హైదరాబాద్‌లోనే సందడి చేస్తున్నారు. నాగ చైతన్య, రాశీ ఖన్నా జంటగా తెరకెక్కుతున్న ‘థ్యాంక్యూ’ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఫుల్ బిజీబిజీగా ఉన్నారు కోలీవుడ్ డైరెక్టర్ విక్రమ్ కుమార్.

శంకర్, లింగు స్వామితో పాటు మరో తమిళ్ డైరెక్టర్ కూడా హైదరాబాద్‌లోనే సందడి చేశారు. రామ్ -లింగు స్వామి సినిమా మేకింగ్ చూడడానికి తమిళ్ టాప్ డైరెక్టర్ భారతీ రాజా లొకేషన్‌కి వచ్చారు. క్లాసిక్ సినిమాలతో తనకంటూ ఓ సెపరేట్ ట్రెండ్ క్రియేట్ చేసుకున్న భారతీ రాజా, రామ్ సినిమా సెట్లో సందడి చేశారు.