Bharath : అల్లు అర్జున్ గంగోత్రి సినిమాని రీమేక్ చేద్దామనుకున్నా.. కానీ..

తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా భరత్ తెలుగు మీడియాతో మాట్లాడాడు. భరత్ మాట్లాడుతూ.. తమిళ సినిమాలతో బిజీగా ఉండి ఇన్నాళ్లు తెలుగు సినిమాలు చేయలేకపోయాను. డైరెక్టర్ వచ్చి ఈ కథ చెప్పాక...................

Bharath : అల్లు అర్జున్ గంగోత్రి సినిమాని రీమేక్ చేద్దామనుకున్నా.. కానీ..

Tamil Hero Bharath comments on telugu movies and allu arjun

Bharath :  బాయ్స్, ప్రేమిస్తే, యువసేన.. లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకి కూడా చేరువయ్యాడు తమిళ్ హీరో భరత్. ఆ తర్వాత ఎక్కువగా తమిళ్ సినిమాలే చేశాడు. చాలా రోజుల తర్వాత తెలుగులో సుధీర్ బాబు నటిస్తున్న ‘హంట్‌’ సినిమాలో ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. ఇందులో పోలీసాఫీసర్ గా కనిపించబోతున్నాడు భరత్. సుధీర్ బాబు హీరోగా, భవ్య క్రియేషన్స్ నిర్మాణంలో కొత్త దర్శకుడు మహేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హంట్ సినిమా రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26న థియేటర్లలో విడుదల కానుంది. దీంతో చిత్రయూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉంది.

Jordar Sujatha : నిజంగానే పెళ్లి చేసుకోబోతున్నాం.. జబర్దస్త్ కమెడియన్‌తో బిగ్‌బాస్ సుజాత వివాహం..

తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా భరత్ తెలుగు మీడియాతో మాట్లాడాడు. భరత్ మాట్లాడుతూ.. తమిళ సినిమాలతో బిజీగా ఉండి ఇన్నాళ్లు తెలుగు సినిమాలు చేయలేకపోయాను. డైరెక్టర్ వచ్చి ఈ కథ చెప్పాక నచ్చడంతో దాదాపు 12 ఏళ్ళ తర్వాత తెలుగులో సినిమా చేస్తున్నాను. ఇందులో ఒక పోలీసాఫీసర్ గా కనిపించబోతున్నాను. తమిళ్ లో నేను కాళిదాసు అనే సినిమాలో పోలీసాఫీసర్ గా నటించాను. ఆ సినిమాలో నా క్యారెక్టర్ నచ్చి డైరెక్టర్ ఈ ఛాన్స్ ఇచ్చారు. ఈ సినిమా మళ్ళీ తెలుగులో నా మార్కెట్ కి హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. టాలీవుడ్ లో అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టం. ఆయన జర్నీని మొదటి నుంచి చూస్తున్నాను. అల్లు అర్జున్ మొదటి సినిమా గంగోత్రిని తమిళ్ లో నేను రీమేక్ చేయాలి. కానీ అనుకోని కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోయింది అని తెలిపాడు.