Dhanush : ముంబైలో ధనుష్.. ఇలా మారిపోయాడేంటి.. వైరల్ అవుతున్న ధనుష్ కొత్త లుక్..

తాజాగా ధనుష్ కొత్త లుక్ వైరల్ గా మారింది. ఇటీవల సార్ సినిమా ప్రమోషన్స్ లో ధనుష్ కొంచెం ఎక్కువ గడ్డం, జుట్టుతో కనపడ్డాడు. ఆ తర్వాత కూడా అలాగే ఎక్కువ జుట్టు, గడ్డంతో కనబడ్డాడు.

Dhanush : ముంబైలో ధనుష్.. ఇలా మారిపోయాడేంటి.. వైరల్ అవుతున్న ధనుష్ కొత్త లుక్..

Tamil Hero Dhanush New look goes viral

Dhanush Look :  తమిళ్ స్టార్ హీరో ధనుష్(Dhanush) ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. వరుసగా బ్యాక్ టు బ్యాక్ తిరు(Thiru), సార్(Sir) సినిమాలతో 100 కోట్ల కలెక్షన్స్ సాధించాడు. త్వరలో కెప్టెన్ మిల్లర్ సినిమాతో రాబోతున్నాడు. ఆ తర్వాత ధనుష్ వెట్రిమారన్(Vetrimaran), శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సినిమాలు చేయబోతున్నాడు. ప్రస్తుతం కెప్టెన్ మిల్లర్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు ధనుష్. ఈ సంవత్సరం చివర్లో కెప్టెన్ మిల్లర్ సినిమా రిలీజ్ అవుతుందని సమాచారం.

అయితే తాజాగా ధనుష్ కొత్త లుక్ వైరల్ గా మారింది. ఇటీవల సార్ సినిమా ప్రమోషన్స్ లో ధనుష్ కొంచెం ఎక్కువ గడ్డం, జుట్టుతో కనపడ్డాడు. ఆ తర్వాత కూడా అలాగే ఎక్కువ జుట్టు, గడ్డంతో కనబడ్డాడు. ఇప్పుడు ధనుష్ ని చూసిన వాళ్లంతా ఆశ్చర్యపోతున్నారు, ఏకంగా ఒక ఋషి లాగా బాగా గడ్డం, జుట్టు పెంచేసి అసలు ధనుష్ ఏనా అని అనుమానం వచ్చేలా మారిపోయాడు.

Samantha : సమంత హాలీవుడ్ సినిమా.. స్టోరీ ఇదేనా? టైటిల్ ఏంటో తెలుసా?

తాజాగా ధనుష్ ముంబై ఎయిర్ పోర్ట్ లో కనిపించగా అతని ఫోటోలు, వీడియోలు వైరల్ గా మారాయి. పలువురు ప్రయాణికులు అతనితో ఫొటోల కోసం ఎగబడ్డారు. బాగా గడ్డం, జుట్టు పెంచేసుకొని ఉన్న ధనుష్ ఫోటోలు, వీడియోలు చూసి ఓ ఋషిలా ఉన్నాడని అభిమానులు, నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ లుక్ కెప్టెన్ మిల్లర్ సినిమా కోసం అని, ఆ సినిమా షూటింగ్ అయ్యేవరకు ఇలాగే ఉంటాడని సమాచారం. దీంతో ప్రస్తుతం ధనుష్ ఫోటోలు వైరల్ గా మారిపోయాయి.