Tamil Heroes: తమిళ తంబీలు మారాలి.. మన హీరోలను చూసి నేర్చుకోవాలి
అనుకున్న కథను స్క్రీన్ మీదకి ప్రజెంట్ చేయడం ఒక్కటే కాదు.. ఆ సినిమాని ప్రేక్షకులలోకి తీసుకెళ్లడం కూడా ఇప్పుడు మేకర్స్ బాధ్యతే. నటీనటుల నుండి దర్శక, నిర్మాతల వరకు అందరికీ ఈ బాధ్యతలో భాగముంటుంది.

Tamil Heroes: అనుకున్న కథను స్క్రీన్ మీదకి ప్రజెంట్ చేయడం ఒక్కటే కాదు.. ఆ సినిమాని ప్రేక్షకులలోకి తీసుకెళ్లడం కూడా ఇప్పుడు మేకర్స్ బాధ్యతే. నటీనటుల నుండి దర్శక, నిర్మాతల వరకు అందరికీ ఈ బాధ్యతలో భాగముంటుంది. అందుకే నిర్మాతలు ముందే ప్రమోషన్లతో సహా అగ్రిమెంట్ చేసుకుంటున్నారు. ప్రమోషన్ లేకుండా.. సినిమాపై ప్రేక్షకులలో ఎలాంటి అంచనాలు లేకుంటే.. మేకర్స్ ఎంత తోపు సినిమా తీసినా అది బాక్సాఫీస్ వద్ద నిలిచే పరిస్థితి లేదు. అందుకే మన తెలుగులో హీరోల నుండి మూవీ టీమ్ అంతా కలిసి భారీ ప్రమోషన్లు చేస్తున్నారు.
Tamil Movies: ఒకే కథను అరగదీస్తున్న దర్శకులు.. వాళ్ళకే ఓటేస్తున్న హీరోలు!
ఇక పాన్ ఇండియా సినిమా అంటే ప్రమోషన్లు కూడా అదే స్థాయిలో దేశమంతా.. ప్రపంచమంతా మోత పుట్టిపోవాలి. అప్పుడే సినిమా గురించి సదరు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసేది. ఈ విషయంలో రాజమౌళిని మెచ్చుకొని తీరాల్సిందే. ఆయన కష్టపడతాడు.. హీరోలను.. హీరోయిన్స్ ను కూడా ప్రమోషన్లకు ఎంతగా వాడుకోవాలో అంతా పిండేసుకొని తన సినిమాని మార్కెట్ చేసుకుంటాడు. అందుకే అపజయం లేకుండా.. జాతీయ స్థాయిలో జేజేలు దక్కించుకుంటున్నాడు.
Tamil Movies: సినీ వెలుగంతా తమిళ పరిశ్రమదే.. కానీ అదంతా గతం!
ఒక్క రాజమౌళి మాత్రమే కాదు.. ఈ మధ్య కాలంలో మన తెలుగు నుండి ఏ సినిమా చూసినా అదే స్థాయిలో ప్రమోషన్లు ఉంటున్నాయి. రాధేశ్యామ్ సినిమాకి ప్రభాస్, రాధాకృష్ణ హిందీలో ఏ రేంజ్ ప్రమోషన్లు చేశారో చూశాం. నిన్నగాక మొన్న ఫారిన్ నుండి దిగీదిగగానే ప్రమోషన్లతో చెలరేగిపోయిన మహేష్ బాబుని చూశాం. ఈ స్థాయిలో మార్కెటింగ్ సూత్రాన్ని పాటిస్తున్నారు కాబట్టే మన తెలుగు సినిమాలకు భారీ వసూళ్లు దక్కుతున్నాయి. పాన్ ఇండియా స్థాయిలో మన సినిమాలకి భారీ డిమాండ్ ఏర్పడుతుంది.
Tamil Movies: కోలీవుడ్ కి ఏమైంది.. గుణపాఠం నేర్పేదెవరు?
ఇక, తమిళ సినిమాలు, తమిళ హీరోల విషయానికి వస్తే.. పేరుకు పాన్ ఇండియా సినిమాలు తీసినా ప్రమోషన్లకు మాత్రం వాళ్ళు అడుగుపెట్టడమే లేదు. ముందుగా వలిమై విషయానికి వస్తే.. తమిళంతో పాటు తెలుగు, హిందీలో కూడా ఈ సినిమా రిలీజ్ చేశారు. ఇందులో తెలుగు యువ నటుడు కార్తికేయ విలన్ కావడంతో అతనితో ఇక్కడ ప్రమోషన్లు చేయించారు తప్ప అజిత్ కానీ.. మేకర్స్ కానీ ఎక్కడా కనిపించలేదు. ఆ తర్వాత విజయ్ బీస్ట్ విషయం కూడా ఇదే జరిగింది.
Tamil Films: ఫుల్ యాక్షన్ మోడ్.. దుమ్ములేపుతున్న తమిళ తంబీలు
బీస్ట్ కి ముందు రెండు సినిమాల విజయంతో తెలుగులో మార్కెట్ పెరిగినా అది కాపాడుకొనేందుకు విజయ్ తెలుగులో ఒక్క ఇంటర్వ్యూ ఇవ్వలేదు. తెలుగు రైట్స్ తీసుకున్న దిల్ రాజు, హీరోయిన్ పూజా హెగ్డేతో పాటు దర్శకుడు నెల్సన్ తో ఒక్క ఇంటర్వ్యూ తీసి దిల్ రాజు సొంత యూట్యూబ్ ఛానెల్ లో పెట్టుకున్నారు. ఇక ఇప్పుడు తెలుగులో కాస్త గుర్తింపు తెచ్చుకుంటున్న శివకార్తికేయన్ కూడా అదే పనిచేశాడు. ఈ శుక్రవారం (మే13) శివకార్తికేయన్ డాన్ సినిమా తెలుగులో కూడా రిలీజయింది. కానీ ఈ సినిమా ఒకటి వచ్చిందని కూడా తెలుగులో పెద్దగా తెలియదు.
Flop Movies: భారీ నష్టాలను తెచ్చిన సినిమాలు.. ఫ్యాన్స్‌కు పీడ కల లాంటి డిజాస్టర్స్!
పాన్ ఇండియా స్థాయిలో ఎదగాలి అనుకోవడం.. ఆ స్థాయిలో సినిమాలు చేయాలని అనుకోవడం తప్పు కాదు.. కానీ అందుకు తగిన హోమ్ వర్క్ కూడా చేయాలి. విజయ్, ధనుష్, శివకార్తికేయన్ లాంటి వాళ్ళు తెలుగులో కూడా డైరెక్ట్ సినిమాలు చేస్తున్నారు. అలాంటపుడు ముందే ఇక్కడి ప్రేక్షకులకు ఇంకా దగ్గర కావాల్సి ఉంది. అదే మన తెలుగు హీరోలను చూస్తే.. హిందీలో మార్కెట్ కోసం జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఉత్తరాదిన చిన్న చిన్న నగరాలకు వెళ్లి ప్రమోషన్లు చేశారు. అందుకే ఈ విషయంలో తమిళ తంబీలు మన హీరోలను చూసి నేర్చుకొని తీరాల్సిందే!
- Vijay : 2023 సంక్రాంతి.. చరణ్ అవుట్.. విజయ్ ఇన్..
- Vijay-Ajith: తమిళం నుండి మెగా మల్టీస్టారర్.. సెట్టైతే థియేటర్లు దద్దరిల్లడం ఖాయం!
- Beast Closing Collections : తెలుగులో బీస్ట్ క్లోజింగ్ కలెక్షన్స్.. దిల్ రాజుకి భారీ నష్టాలు..
- Beast: బీస్ట్ దెబ్బకు పక్కకు తప్పుకున్న రజినీ..?
- Vijay Father : ‘బీస్ట్’ సినిమాలో స్క్రీన్‌ప్లే అస్సలు బాలేదు
1IPL2022 RCB Vs GujaratTitans : పాండ్యా కెప్టెన్ ఇన్నింగ్స్.. బెంగళూరు టార్గెట్ ఎంతంటే
2Supreme Court: ఏపీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ.. అమరరాజాపై చర్యలపై స్టే
3NBK107: అఖండ సెంటిమెంట్‌ను మళ్లీ ఫాలో అవుతున్న బాలయ్య..?
4She Teams: షీ టీమ్స్‌కు వెల్లువెత్తిన ఫిర్యాదులు.. నిందితులపై కేసులు
5Virat Kohli: కోహ్లీ.. గంగూలీ లాంటి కెప్టెన్ కాలేకపోయాడు – సెహ్వాగ్
6Cars24 Lays Off : ఉద్యోగులకు కార్స్24 షాక్.. 600 మంది తొలగింపు
7Police Recruitment: నిలిచిపోయిన పోలీస్ రిక్రూట్మెంట్ వెబ్సైట్.. ఆందోళనలో అభ్యర్థులు
8Allu Arjun: మహేష్‌కు అట్టర్ ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్‌తో బన్నీ మూవీ..?
9Guinness World Record: గిన్నీస్ వరల్డ్ రికార్డ్ కోసం 36 గంటల పాటు ఊయలూగుతూ..
10Delhi Metro: కేబుల్ ఎత్తుకెళ్లిన దొంగలు.. నెమ్మదిగా నడుస్తున్న మెట్రో రైళ్లు
-
F3: ట్రిపుల్ ఫన్ మాత్రమే కాదు.. ట్రిపుల్ రెమ్యునరేషన్ కూడా!
-
NTR30: ధైర్యమే కాదు.. భయం కూడా రావాలి.. పూనకం తెప్పించిన తారక్!
-
Mahesh Babu: మహేష్ సినిమాలో మరో స్టార్ హీరో.. ఎవరంటే?
-
F3: ఎఫ్3 రన్‌టైమ్.. రెండున్నర గంటలు నవ్వులే నవ్వులు!
-
Tamannaah: ఆ ఒక్క సినిమా చేయకుండా ఉండాల్సింది.. తమన్నా షాకింగ్ కామెంట్స్!
-
Cardimom : చర్మసౌందర్యానికి మేలుకలిగించే యాలకుల్లోని యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు!
-
Raw Mango : కాలేయానికి మేలు చేసే పచ్చి మామిడి పండు!
-
JAMUN : జీర్ణక్రియను మెరుగుపరిచి, రక్తపోటును నియంత్రణలో ఉంచే నేరేడు పండ్లు!