Tamil Movies: అరవ హీరోల రొటీన్ ఫార్ములా.. ఎన్నాళ్లీ రొడ్డకొట్టుడు సామీ!

మూస కథల్నే నమ్ముకుంటున్న తమిళ్ హీరోలకు షాక్ మీద షాక్ తగులుతోంది. రొటీన్ ఫార్ములాతో వస్తోన్న సినిమాలను నిర్మొహమాటంగా ప్రేక్షకులు తిప్పికొడుతున్నారు. ఇప్పుడు విజయ్ బీస్ట్ కూడా..

Tamil Movies: అరవ హీరోల రొటీన్ ఫార్ములా.. ఎన్నాళ్లీ రొడ్డకొట్టుడు సామీ!

Tamil Movies

Tamil Movies: మూస కథల్నే నమ్ముకుంటున్న తమిళ్ హీరోలకు షాక్ మీద షాక్ తగులుతోంది. రొటీన్ ఫార్ములాతో వస్తోన్న సినిమాలను నిర్మొహమాటంగా ప్రేక్షకులు తిప్పికొడుతున్నారు. ఇప్పుడు విజయ్ బీస్ట్ కూడా ఆ కోవలోకే చేరిపోయింది. ఎన్ని ఎగ్జాంపుల్స్ కనిపిస్తున్నా కూడా కోలీవుడ్ స్టార్స్ ఎందుకు మారట్లేదు.. ఇంకెన్ని రొడ్డకొట్టుడు సినిమాలను తీసుకొచ్చి ప్రేక్షకులకు పరీక్ష పెడతారు..?

Tamil Movies: కథలేని సినిమాలు.. లాజిక్ మిస్సైతే అడ్రెస్స్ గల్లంతే

సినిమా హాల్ లో నిప్పంటించడం పెద్ద తప్పు. కానీ బీస్ట్ చూసి రగిలిపోయిన దళపతి విజయ్ ఫ్యాన్స్.. వాళ్ల ఫ్రస్టేషన్ ను ఇలా చూపిస్తున్నారు. ఎన్నో ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకొని థియేటర్ కి వస్తే.. ఇలా నిరాశపరుస్తారా అని డైరెక్ట్ గానే మండిపడుతున్నారు. రెగ్యులర్ స్టోరీ, రోటీన్ స్క్రీన్ ప్లే, లాజిక్ లేని సీన్స్, స్లో నేరేషన్.. అన్నీ కలిసి విజయ్ బీస్ట్ పరాజయానికి కారణమయ్యాయి. పాన్ ఇండియా స్థాయిలో పక్క రాష్ట్ర హీరోలు స్టామినా చూపిస్తుంటే.. ఇంకెంత కాలం ఇలాంటి కథల్ని నమ్ముకుంటారని నేరుగానే ప్రశ్నిస్తున్నారు.
South India Movies: ఇండియన్ సినిమాకు కేరాఫ్ అడ్రస్‌గా సౌత్ సినిమాలు!

వరుసగా తమిళ్ హీరోలు ఇలానే కంటెంట్ లేని కథలతో థియేటర్స్ కి వచ్చి.. ఫ్యాన్స్ ను మెప్పించలేకపోతున్నారు. ఈమధ్యే వచ్చిన వలిమై పరిస్థితి అంతే. సరైన కథ లేకుండా పూర్తిగా రేస్, యాక్షన్ ఎలిమెంట్స్ తో సినిమాను నింపేస్తే జనం తిప్పికొట్టారు. ఆకాశమే నీ హద్దురా, జై భీమ్ సినిమాలతో ఎంత పేరుతెచ్చుకున్నాడో.. ఈటీతో సూర్య నెగెటివ్ టాక్ మూటగట్టుకున్నాడు. మాస్ ఎలివేషన్ సీన్స్ ఉంటే చాలు అనుకుంటే ఇప్పుడు కుదరదు.. వాటితో ఓ ఇంటెన్స్ ఉన్న స్టోరీ చెప్పాలన్న లాజిక్ అజిత్, సూర్య మిస్ అయ్యారు.

Tollywood Big Movies: ఎంత తోప్ సినిమా అయినా.. లెక్కలు తేల్చేది ప్రేక్షకులే!

సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా సీనియారిటీని నిలబెట్టుకోలేకపోతున్నారు. ఇప్పటికీ మూస కథల్నే ఎక్కువగా నమ్ముకుంటున్నారు. లింగా నుంచి మొదలెడితే రీసెంట్ అన్నాత్తే వరకు రజనీ లిస్ట్ లో ఎక్కువగా ఫ్లాప్సే కనిపిస్తాయి. ఈ విషయంలో ధనుష్ కూడా ఏం తక్కువ తినలేదు. రజనీ, విజయ్, అజిత్, ధనుశ్, సూర్య.. ఎవరైనా సరే ఇలాంటి సోల్ లేని స్టోరీస్ తో కొంతవరకు తమిళ్ ఆడియెన్స్ మెప్పు పొందొచ్చు. కానీ టేస్ట్ మారిన మాక్సిమమ్ ఆడియెన్స్ ఒప్పుకుంటేనే సినిమా హిట్ అనేది గుర్తించకపోతే కష్టమే.

High Budget Movies: ఎఫీషియన్సీ లోపం.. సినిమాలను ఆదుకోలేని గ్రాండియర్!

గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న సినిమాల్లో తమిళ్ హీరోలు 100 పర్సెంట్ ఎఫర్ట్స్ పెడుతున్నామంటున్నారు. యాక్షన్ విషయంలో కూడా మంచి మార్కులే పడుతున్నాయి. కానీ పూర్ కంటెంట్ వీళ్లని దెబ్బ కొడుతోంది. లాజిక్ లేని సీన్స్, అర్థం పర్థం లేని స్క్రీన్ ప్లేతో సినిమాను నడిపిస్తున్న డైరెక్టర్స్ పైనే చివరికి నెగెటివ్ ముద్ర పడుతోంది. అందుకే తమిళ్ స్టార్స్.. తెలుగు డైరెక్టర్ల కోసం క్యూ కడుతున్నారనే టాక్ వినిపిస్తోంది. విజయ్, ధనుశ్, శివకార్తీకేయన్ లాంటి హీరోలు నేరుగా టాలీవుడ్ డైరెక్టర్స్ తో పాన్ ఇండియా సినిమాలు చేసి.. నెక్ట్స్ దుమ్మురేపుతామంటున్నారు.