Telugu Cinema : తెలుగు దర్శకుల వైపు తమిళ హీరోల చూపు

చాలా మంది తమిళ హీరోలకి తెలుగులో మంచి మార్కెట్ ఉంది. దీంతో ఇక్కడి డైరెక్టర్స్ తో కొత్త కొత్త కథలతో సినిమాలు తీసి విజయం సాధించి తెలుగులో కూడా తమ మార్కెట్ ని పెంచుకోవాలని........

Telugu Cinema : తెలుగు దర్శకుల వైపు తమిళ హీరోల చూపు

Telugu Movie

Telugu Cinema :   ఒకప్పుడు తెలుగులో బాలీవుడ్ నుంచి తమిళ్ నుంచి సినిమాలు తెచ్చుకొని రీమేక్ లు ఎక్కువగా చేసేవారు. కానీ అదంతా ఒకప్పుడు. ఇప్పుడు తెలుగు సినిమాల స్థాయి పెరిగింది. స్థానం పెరిగింది. ఒకపక్క బాహుబలి, సాహో, పుష్ప లాంటి సినిమాలతో దేశం మొత్తం కలెక్షన్స్ కొల్లగొడుతున్నాము. మరో పక్క ‘జెర్సీ’ లాంటి మంచి మంచి కథలున్న సినిమాలు అందిస్తున్నాము. గతంలో పోలిస్తే ఇటీవల తెలుగు సినిమాల విజయాల శాతం పెరిగింది. దీంతో దేశం మొత్తం తెలుగు సినీ పరిశ్రమ వైపు చూస్తుంది.

ఇప్పటివరకు తెలుగులో బాగున్న సినిమా కథలన్నీ రీమేక్ చేశారు. కానీ ఇప్పుడు ఏకంగా తెలుగులోనే డైరెక్ట్ సినిమాలు చేయాలనీ చూస్తున్నారు. చాలా మంది తమిళ హీరోలకి తెలుగులో మంచి మార్కెట్ ఉంది. దీంతో ఇక్కడి డైరెక్టర్స్ తో కొత్త కొత్త కథలతో సినిమాలు తీసి విజయం సాధించి తెలుగులో కూడా తమ మార్కెట్ ని పెంచుకోవాలని చూస్తున్నారు తమిళ హీరోలు. తమిళ హీరోలు వరుసగా తెలుగు దర్శకులతో సినిమాలు అనౌన్స్ చేస్తున్నారు.

John Abraham : బాలీవుడ్ స్టార్ కపుల్ కి కరోనా పాజిటివ్

తమిళ్ స్టార్ హీరో విజయ్ తెలుగులో వంశీ పైడిపల్లితో సినిమాని అనౌన్స్ చేశారు. ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్నారు.

మరో స్టార్ హీరో ధనుష్ కి తెలుగులో మంచి మార్కెట్ ఉంది. ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో ఒక సినిమాని అన్నౌన్స్ చేశారు.

ధనుష్ మరో తెలుగు సినిమాని కూడా అనౌన్స్ చేశారు. తొలిప్రేమ, మిస్టర్ మజ్ను, రంగ్ దే లాంటి సినిమాలతో గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ లో ఈ సినిమా రాబోతుంది. ఈ సినిమా పూజా ముహూర్తం ఇవాళే జరిగింది.

తాజాగా తమిళ్ హీరో శివ కార్తికేయన్ హీరోగా జాతిరత్నాలు డైరెక్టర్ అనుదీప్‌తో సినిమాను అనౌన్స్ చేశారు. ఈ సినిమాని సురేష్ ప్రొడక్షన్స్ మరో రెండు బ్యానర్స్ తో కలిసి నిర్మిస్తుంది.

NBK 107 : బాలయ్య సినిమాలో విలన్ గా కన్నడ స్టార్ హీరో

ఇలా తమిళ స్టార్ హీరోలంతా వరుసపెట్టి తెలుగు డైరెక్టర్స్ తో డైరెక్ట్ తెలుగు సినిమాలు చేస్తుండటంతో వేరే పరిశ్రమ హీరోల చూపు కూడా తెలుగుపై పడింది. ఇప్పటికే చాలా మంది తెలుగు డైరెక్టర్స్ బాలీవుడ్ లో సినిమాలు చేస్తూ బాలీవుడ్ ని ఏలేస్తున్నారు. మొత్తానికి అటు బాలీవుడ్ ని, ఇటు కోలీవుడ్ ని తెలుగు సినీ పరిశ్రమ త్వరలోనే పూర్తిగా రూల్ చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు.