Pooja Hegde : తమిళ్ వాళ్ళకి కూడా పూజాహెగ్డేనే కావాలంట..

పూజాహెగ్డే తెలుగుతో పాటు హిందీ మూవీస్ తో ఫుల్ బిజీ షెడ్యూల్ గడుపుతోంది. అయినా తమిళ్ ఆఫర్స్ ని వదులుకోవడం లేదు. తమిళ డైరెక్టర్ శివ తెరకెక్కిస్తున్న సూర్య 40వ సినిమాలో..........

Pooja Hegde : తమిళ్ వాళ్ళకి కూడా పూజాహెగ్డేనే కావాలంట..

Pooja Hegde

Pooja Hegde :  ఇప్పుడు సౌత్ నుంచి నార్త్ వరకు పూజాహెగ్డే పేరే మారు మోగిపోతోంది. హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ అమ్మడు వరసగా ఆఫర్స్ కొట్టేస్తుంది. రీసెంట్ గా విజయ్ సరసన నటించిన బీస్ట్ ఫ్లాప్ అయినా, మరో తమిళ స్టార్ సూర్య ఈ బుట్టబొమ్మతో రొమాన్స్ చేయడానికే ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు.

పూజాహెగ్డే తెలుగుతో పాటు హిందీ మూవీస్ తో ఫుల్ బిజీ షెడ్యూల్ గడుపుతోంది. అయినా తమిళ్ ఆఫర్స్ ని వదులుకోవడం లేదు. తమిళ డైరెక్టర్ శివ తెరకెక్కిస్తున్న సూర్య 40వ సినిమాలో పూజాహెగ్డేనే హీరోయిన్ గా నటించనున్నట్టు సమాచారం. ప్రస్తుతం సూర్య 41వ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుగుతోంది. బాల తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో కృతిశెట్టి సూర్య సరసన నటిస్తోంది. ప్రాడ్యూసర్ మారడంతో ఆల్రెడీ భారీ బడ్జెట్ తో మొదలు పెట్టి ఆగిపోయిన సూర్య 40వ సినిమాను మళ్లీ పట్టాలెక్కిస్తున్నారు. ఆ సినిమాకోసం హీరోయిన్ గా పూజాహెగ్డేను సంప్రదించారు.

Tollywood : అప్పుడే దసరాకి మొదలైన ఫైట్.. స్టార్లంతా సిద్ధం..

బుట్టబొమ్మ కూడా సూర్యతో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. విజయ్ సరసన పూజా నటించిన బీస్ట్ సక్సెస్ కాకపోయినా పూజాహెగ్డేకు మాత్రం అక్కడ మంచి క్రేజ్ నే తీసుకొచ్చింది. తమిళ స్టార్స్ కూడా బుట్టబొమ్మను హీరోయిన్ గా తీసుకోవడానికే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే, తెలుగు, హిందీ సినిమాలతో బిజీగా ఉన్న పూజా మాత్రం తమిళ్ లో సెలక్టివ్ గా మూవీస్ చేయడానికే ఆసక్తి చూపిస్తోంది. ప్రస్తుతం పూజా హిందీలో సర్కస్, కబీఈద్ కబీ దివాలి, తెలుగులో జనగణమనతో పాటు మహేశ్ బాబు కాంబోలో సినిమాలు చేస్తోంది. తమిళ్ లో 2012లోనే మాస్క్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన పూజాహెగ్డేకు ఇన్నేళ్ల తర్వాత బీస్ట్ తో క్రేజ్ వచ్చింది. మొత్తానికి తమిళ్ లో కూడా బిజీ అవ్వబోతుంది పూజాహెగ్డే.