Tamil Movies : క్లాసిక్ హిట్స్‌కి సీక్వెల్స్ అనౌన్స్ చేస్తున్న కోలీవుడ్..

ఇప్పుడు సౌత్ ఇండియాకి పాన్ ఇండియా వైరస్ ఎంతలా పట్టుకుందో, సీక్వెల్ ఫీవర్ కూడా అంతే పట్టుకుంది. ఎందుకంటే ఇప్పుడొస్తున్న భారీ బడ్జెట్ సినిమాలకు సీక్వెల్స్...........

Tamil Movies : క్లాసిక్ హిట్స్‌కి సీక్వెల్స్ అనౌన్స్ చేస్తున్న కోలీవుడ్..

Chandramukhi 2

Classic Hits :  ఇప్పుడు సౌత్ ఇండియాకి పాన్ ఇండియా వైరస్ ఎంతలా పట్టుకుందో, సీక్వెల్ ఫీవర్ కూడా అంతే పట్టుకుంది. ఎందుకంటే ఇప్పుడొస్తున్న భారీ బడ్జెట్ సినిమాలకు సీక్వెల్స్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. అయితే ఎప్పుడో వచ్చి క్లాసిక్ హిట్స్ గా నిలిచిన సినిమాలను కూడా ఇప్పుడు సీక్వెల్స్ గా చేస్తామంటున్నారు కోలీవుడ్ దర్శక నిర్మాతలు.

 

1996లో డైరెక్టర్ శంకర్, కమలహాసన్ కాంబినేషన్ లో వచ్చిన భారతీయుడు అప్పుడు సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇన్ని సంవత్సరాల తర్వాత భారతీయుడు సీక్వెల్ చేస్తున్నారు కమల్. అయితే కోవిడ్, సెట్ లో ఫైర్ యాక్సిడెంట్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ మధ్య తేడాలు.. ఇలా పలు కారణాలతో ఈ సినిమా షూటింగ్ కి తాత్కాలిక బ్రేకులు పడ్డాయి. ఆ తర్వాత శంకర్, రామ్ చరణ్ మూవీతో, కమలహాసన్ విక్రమ్ సినిమాతో బిజీ అయిపోయారు. ప్రస్తుతం విక్రమ్ గ్రాండ్ సక్సెస్ సాధించింది. విక్రమ్ సక్సెస్ తో ఫుల్ జోష్ మీదున్న కమలహాసన్ భారతీయుడు సీక్వెల్ పై స్పందిస్తూ శంకర్, రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా కంప్లీట్ అవగానే పాన్ ఇండియా సినిమాగా రానున్న భారతీయుడు సీక్వెల్ వర్క్ జరుగుతుందని క్లారిటీ ఇచ్చి ఫ్యాన్స్ ను ఖుషి చేశారు.

Bharatheeyudu 2

 

అర్జున్ హీరోగా శంకర్ డైరెక్షన్ లో వచ్చిన ఫస్ట్ మూవీ జెంటిల్ మెన్. 1993లో రిలీజైన ఈ సినిమా అప్పుడు సంచలన విజయం సాధించింది. కె.టి కుంజుమన్ తమిళంలో నిర్మించిన ఈ సినిమాను అదే పేరుతో తెలుగులో అనువదించి సూపర్ హిట్ కొట్టారు ఏఎం రత్నం. ఆమధ్య కెటి కుంజుమన్ జెంటిల్ మెన్ 2 పాన్ ఇండియా సినిమాగా చేస్తున్నట్టు ప్రకటించి ఆడియన్స్ లో ఆసక్తిని కలిగించారు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఒక్కొక్క అప్ డేట్ ఇస్తూ వస్తున్న కుంజుమన్, ఈ సినిమాలో నయనతార చక్రవర్తితో పాటు, ప్రియాలాల్ హీరోయిన్స్ గా నటిస్తున్నట్టు ప్రకటించారు. కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్ గా, డైరెక్టర్ గా గోకుల్ కృష్ణని ప్రకటించారు. అయితే ఇప్పటివరకు హీరోను రివీల్ చేయలేదు. ఈ సినిమా ఫుల్ డిటైల్స్ కోసం ఎదరు చూస్తున్నారు జెంటిల్ మెన్ ఫ్యాన్స్.

Bollywood : బ్రహ్మస్త్ర పార్ట్ 1 రిలీజ్ కాలేదు.. అప్పుడే పార్ట్ 2,3 గురించి చర్చలు..

ఇక సూపర్ స్టార్ రజనీకాంత్, నయనతార, జ్యోతిక, ప్రభు ముఖ్య పాత్రల్లో నటించిన 2005 సూపర్ హిట్ హార్రర్ కామెడి మూవీ చంద్రముఖి. ఇన్ని సంవత్సారాల తర్వాత ఆ సినిమాకు సీక్వెల్ అనౌన్స్ చేసి, ఫ్యాన్స్ ను ఎగ్జైట్ చేశారు దర్శక నిర్మాతలు. చంద్రముఖి 2లో రజనీకాంత్ క్యారెక్టర్ లో రాఘవ లారెన్స్ నటించబోతున్నట్టు ప్రకటించారు. చంద్రముఖి తెరకెక్కించిన పి. వాసు ఈ సినిమాకు డైరెక్షన్ చేయబోతుండగా అప్పుడు నిర్మించిన శివాజి ప్రొడక్షన్స్ ప్లేస్ లో లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. చంద్రముఖిలో తన మార్క్ టైమింగ్ తో నవ్వించిన వడివేలు పార్ట్ 2లోనూ నవ్వించబోతున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమా పైన ఆడియన్స్ బాగానే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇలా ఒకప్పటి క్లాసిక్ హిట్స్ కి వరుసగా సీక్వెల్స్ అనౌన్స్ చేస్తుంది కోలీవుడ్. అయితే వీటన్నిటిని పాన్ ఇండియా సినిమాలుగానే రిలీజ్ చేయనున్నారు.