కిరాణ దుకాణం పెట్టుకున్న దర్శకుడు

  • Published By: madhu ,Published On : July 4, 2020 / 01:07 PM IST
కిరాణ దుకాణం పెట్టుకున్న దర్శకుడు

కరోనా ఇప్పట్లో వదిలేలా కనిపించడం లేదు. ఎంతో మంది జీవితాలను ప్రభావితం చేస్తోంది. చాలా మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అష్టకష్టాల పాలు చేస్తున్న ఈ మహమ్మారిని శాపనార్థాలు పెడుతున్నారు. చేసింది ఇక చాలు..వెళ్లిపో..అంటున్నారు. భారతదేశంలో కూడా ఈ వైరస్ వేగంగా వ్యాపిస్తోంది.

రకరకాల ఇన్ ఫెక్షన్ లతో వస్తున్న ఈ వైరస్ దెబ్బకు వైద్యులు తలలు పట్టుకుంటున్నారు. ఆ రంగం..ఈ రంగం అనేది లేదు. అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపింది. ఇందులో సినిమా రంగం కూడా ఉంది. లాక్ డౌన్ విధించడం..నియమ నిబంధనలు ఉండడంతో షూటింగ్ జరగడం లేదు.

దీంతో ఈ రంగంపై ఆధార పడిన ఎంతో మంది జీవితాలను ప్రభావితం చూపెట్టింది. ఉపాధి లేకపోవడంతో ఇతర పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఇప్పటికే ఒకరు కూరగాయాలు విక్రయిస్తుండగా..మరొకరు ఇతర వ్యాపార రంగంలోకి దిగుతున్నారు. తాజాగా…ఓ దర్శకుడు కిరాణ షాపు పెట్టుకున్నారు.

చెన్నైకి చెందిన సినీ దర్శకుడు ఆనంద్ కు..కుటుంబ పోషణ భారంగా మారిపోయింది. పదేళ్లకు పైగా సినిమా రంగంలో ఉండి..ఎన్నో సినిమాలు చేశారు. కానీ కరోనా కారణంగా..సినిమా షూటింగ్స్ అన్ని నిలిచిపోయాయి. దీంతో వందల రోజులకు పైగా ఇదే పరిస్థితి ఉండడంతో..చేతులో ఉన్న డబ్బు కాస్తా అయిపోయింది.

ఖాళీగా ఉండలేక..ఫ్రెండ్ సహాయంతో కిరాణ షాపు తెరిచినట్లు వెల్లడించారు ఆనంద్. నిత్యావసర సరుకులను తక్కువ ధరకే విక్రయిస్తున్నానని, సినిమా హాల్స్ తెరవడం..షూటింగ్ లకు ప్రారంభయ్యే వరకు తాను ఇలా చేయకతప్పదంటున్నారు. ‘ఓరు మజాయ్ నాంగు సారాల్’ ‘మౌనా మజాయ్’ సినిమాలు చేసి తమిళ ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. ప్రస్తుతం ‘తునింతు సీ’ అనే సినిమా షూటింగ్ కొనసాగుతోంది. కరోనా కారణంగా మధ్యలోనే నిలిపివేయాల్సి వచ్చింది.

Read:కరోనా..మంటగలుస్తున్న మానవత్వం..3 గంటల పాటు నడి రోడ్డుపై వృద్దుడి మృతదేహం