Vijay : ప్రశాంత్ కిషోర్‌తో తమిళ్ స్టార్ హీరో విజయ్ భేటీ.. 2024 లోక్‌సభ ఎలక్షన్స్ టార్గెట్??

తాజాగా హైదరాబాద్‌లో కొన్ని రోజుల క్రితం విజయ్ ప్రముఖ రాజకీయ నిపుణుడు, పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్‌ కిషోర్‌ ని కలిసినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రశాంత్ కిషోర్ దేశంలోని........

Vijay : ప్రశాంత్ కిషోర్‌తో తమిళ్ స్టార్ హీరో విజయ్ భేటీ.. 2024 లోక్‌సభ ఎలక్షన్స్ టార్గెట్??

Prashanth Kishore

 

Vijay : తమిళ్ స్టార్ హీరో విజయ్ రాజకీయాల్లోకి వస్తారని చాలా కాలంగా ప్రచారం జరుగుతుంది. విజయ్ తండ్రి ఎస్‌ఏ చంద్రశేఖర్‌ ఇప్పటికే పార్టీని రిజిస్టర్ చేయించి కార్యకలాపాలు కూడా జరుపుతున్నారు. ‘ఆలిండియా దళపతి విజయ్‌ మక్కల్‌ ఇయక్కం’ పేరుతో పార్టీ పేరును రిజిస్టర్‌ చేశారు. కానీ తర్వాత విజయ్ ఒత్తిడితో ఆ పార్టీని ఉపసంహరించుకున్నారు. పార్టీని ఉపసంహరించుకున్నా పార్టీ కార్యాలయం అలానే ఉంచి కార్యకలాపాలు నడిపిస్తున్నారు.

గతంలో విజయ్ తనకి రాజకీయాల్లోకి వచ్చే ఆసక్తి లేదని కూడా చెప్పారు. కాని ఇటీవల తమిళనాడులో జరిగిన మున్సిపాలిటీ, పంచాయతీ ఎన్నికల్లో కొన్నిచోట్ల విజయ్‌ మక్కల్‌ ఇయక్కంకు చెందిన అభ్యర్థులు పోటీ చేసి గెలుపొందారు. వారందరినీ విజయ్‌ ఇంటికి పిలిపించుకుని ఫొటో దిగారు. దీంతో మరోసారి విజయ్ రాజకీయాల్లోకి రానున్నారని తమిళ మీడియాలో వార్తలు ప్రసారం అయ్యాయి. విజయ్ కూడా తమిళనాడు 2026 అసెంబ్లీ ఎలక్షన్స్ ని టార్గెట్ చేసుకొని రాజకీయాల్లోకి రావాలని అనుకుంటున్నట్టు తెలుస్తుంది.

Babloo : ఆర్య సమాజ్‌లో ప్రేమ పెళ్లి చేసుకున్న కమెడియన్

తాజాగా హైదరాబాద్‌లో కొన్ని రోజుల క్రితం విజయ్ ప్రముఖ రాజకీయ నిపుణుడు, పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్‌ కిషోర్‌ ని కలిసినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రశాంత్ కిషోర్ దేశంలోని పలు పార్టీలకి పని చేసి విజయం సాధించేందుకు సపోర్ట్ చేశాడు. ఇటీవల తెలంగాణ సీఎం కెసిఆర్ కూడా ప్రశాంత్ కిషోర్ ని వచ్చే ఎన్నికల్లో సపోర్ట్ చేయమని నియమించుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ తరచూ హైదరాబాద్ వస్తున్నారు. ఇలా హైదరాబాద్ వచ్చినప్పుడు విజయ్ ప్రశాంత్ కిషోర్ ని కలిసాడని సన్నిహిత వర్గాల నుంచి సమాచారం.

NTR : నా భార్య బర్త్‌డే వదిలేసి చరణ్ కోసం వెళ్ళేవాడిని

తమిళనాడు 2026 అసెంబ్లీ ఎలక్షన్ల కంటే ముందే 2024 లోక్ సభ ఎలక్షన్స్ లో విజయ్ పోటీ చేయాలనుకుంటున్నాడని, అందుకు ప్రశాంత్ కిషోర్ సహాయం కోసం వచ్చి మాట్లాడినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం తమిళనాడులో డీఎంకే ప్రభుత్వం ఉంది. ఈ పార్టీకి బలమైన ఓటు బ్యాంకు ఉంది. జయలలిత చనిపోవడంతో అన్నాడీఎంకే నాయకత్వ లోపంతో సతమతం అవుతుంది. అందులోని కొంతమంది నాయకులు వేరే పార్టీలవైపు చూస్తున్నారు. దీంతో విజయ్ ఈ పార్టీ మీద కూడా దృష్టి సారించినట్లు సన్నిహిత వర్గాలు అంటున్నాయి. విజయ్‌ అధికారికంగా పార్టీని అనౌన్స్ చేస్తే అన్నాడీఎంకేతో పాటు కాంగ్రెస్ నాయకులు కూడా చేరే అవకాశం ఉంది. మరి విజయ్ సీరియస్ గా రాజకీయాల్లోకి రానున్నాడా? లేక ప్రశాంత్ కిషోర్ ని వేరే దేనికోసమైనా మీట్ అయ్యాడా వారికే తెలియాలి.