Varisu Collections : 300 కోట్లు కొల్లగొట్టిన వారసుడు.. ప్రాఫిట్స్ వచ్చినట్టా?? లేనట్టా?

తమిళ్ లో ఈ సినిమా భారీ విజయం సాధించింది. విజయ్ ఇప్పటివరకు ఇలాంటి ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ సినిమా చేయకపోవడంతో అక్కడ ప్లస్ అయింది. తమిళ్ లో కలెక్షన్స్ బాగానే వచ్చాయి. స్టార్ హీరో సినిమా అవ్వడం, పండగకు రిలీజ్ అవ్వడంతో మొదటి మూడు రోజుల్లోనే వరిసు సినిమా.................

Varisu Collections : 300 కోట్లు కొల్లగొట్టిన వారసుడు.. ప్రాఫిట్స్ వచ్చినట్టా?? లేనట్టా?

Varisu Collects 300 crores gross collections worldwide

Varisu Collections :  తమిళ్ స్టార్ హీరో విజయ్, రష్మిక జంటగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో తమిళ్ లో తెరకెక్కిన సినిమా వరిసు. ఈ సినిమాని తెలుగులో వారసుడుగా రిలీజ్ చేశారు. ఈ సినిమాలో జయసుధ, శరత్ కుమార్, శ్రీకాంత్, సంగీత, శ్యామ్.. ఇలా చాలా పెద్ద క్యాస్టింగ్ ఉంది. ఈ సినిమాకి బడ్జెట్ కూడా భారీగానే పెట్టారు. ఇది ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్టైన్మెంట్ స్టోరీ. ఇలాంటివి తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. దీంతో ఈ సినిమా తెలుగులో అంతగా ఆడలేదు. సంక్రాంతికి రిలీజ్ చేశారు కాబట్టి ఓపెనింగ్స్ మాత్రం వచ్చాయి. తెలుగులో ఈ సినిమా కేవలం 40 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ మాత్రమే సాధించిందని సమాచారం.

అయితే తమిళ్ లో ఈ సినిమా భారీ విజయం సాధించింది. విజయ్ ఇప్పటివరకు ఇలాంటి ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ సినిమా చేయకపోవడంతో అక్కడ ప్లస్ అయింది. తమిళ్ లో కలెక్షన్స్ బాగానే వచ్చాయి. స్టార్ హీరో సినిమా అవ్వడం, పండగకు రిలీజ్ అవ్వడంతో మొదటి మూడు రోజుల్లోనే వరిసు సినిమా 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని రాబట్టింది. తాజాగా వరిసు సినిమా ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 300 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసిందని నిర్మాణ సంస్థ ప్రకటించింది.

Movie shootings : షూటింగ్స్ తో బిజీ అయిన స్టార్ హీరోలు.. ఎవరి షూటింగ్ ఎక్కడ?

వరిసు సినిమా ఆల్మోస్ట్ లాంగ్ రన్ అయినట్టే. తమిళ్ లో కొన్ని థియేటర్స్ లో తప్ప ఇంకెక్కడా ఈ సినిమా ఆడట్లేదు. 300 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ రాగా 150 కోట్ల వరకు షేర్ కలెక్షన్స్ వచ్చినట్టు సమాచారం. సినిమా బడ్జెట్ 150 కోట్లకి పైనే పెట్టినట్టు తెలుస్తుంది. ఇక వరిసు సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాలు కలిపి ఆల్మోస్ట్ 170 కోట్ల వరకు జరిగింది. అంటే వరిసు సినిమా దాదాపు 180 కోట్లు షేర్ కలెక్షన్స్ వసూలు చేస్తే కానీ ప్రాఫిట్స్ వచ్చినట్టు కాదు. కానీ ఇప్పటికి కేవలం 150 కోట్లు షేర్ కలెక్షన్స్ మాత్రమే వచ్చాయి. ఇంకో 30 కోట్లు కనీసం వస్తే వరిసు సినిమా హిట్ ట్రాక్ లోకి వచ్చినట్టు. అయితే ఇది డిస్ట్రిబ్యూటర్స్ కి లాస్ గానే మిగులుతుంది. కానీ నిర్మాతకి ఓటీటీ రైట్స్, శాటిలైట్ రైట్స్ ద్వారా కూడా బాగానే రావడంతో దిల్ రాజు ఆ రకంగా లాభాలు సంపాదించాడు. మొత్తానికి వరిసు తమిళ్ లో హిట్ టాక్ తెచ్చుకున్నా, భారీ కలెక్షన్స్ వచ్చినా పెద్ద బడ్జెట్ సినిమా కావడంతో ప్రాఫిట్స్ విషయంలో తడబడుతుంది.