Tamil Movies: కథలేని సినిమాలు.. లాజిక్ మిస్సైతే అడ్రెస్స్ గల్లంతే

ఎంత తోపు స్టార్ హీరో ఉన్నా.. ఎంత మంది టాప్ స్టార్ కాస్ట్ ఉన్నా, ఎన్ని వందల కోట్లు బడ్జెట్ ఉన్నా.. ఎంత గ్రాండ్ గా సినిమాలు తీసినా.. కథ లేకపోతే అడ్రస్ లేకుండా పోతాయి. స్టార్ కాస్ట్..

Tamil Movies: కథలేని సినిమాలు.. లాజిక్ మిస్సైతే అడ్రెస్స్ గల్లంతే

Tamil Movies

Tamil Movies: ఎంత తోపు స్టార్ హీరో ఉన్నా.. ఎంత మంది టాప్ స్టార్ కాస్ట్ ఉన్నా, ఎన్ని వందల కోట్లు బడ్జెట్ ఉన్నా.. ఎంత గ్రాండ్ గా సినిమాలు తీసినా.. కథ లేకపోతే అడ్రస్ లేకుండా పోతాయి. స్టార్ కాస్ట్ సినిమా మీద ఇంట్రస్ట్ క్రియేట్ చేస్తాయేమో కానీ.. సినిమా ఆడాలంటే మాత్రం అల్టిమేట్ గా కావల్సింది కథే. ఈ లాజిక్ మిస్ అయ్యి డిజాస్టర్లు ఫేస్ చేస్తున్న తమిళ్ స్టార్ హీరోలెవరో లెట్స్ హ్యావ్ ఎ లుక్.

Tamil Films: ఫుల్ యాక్షన్ మోడ్.. దుమ్ములేపుతున్న తమిళ తంబీలు

ఒక సినిమా హిట్ అవ్వాలన్నా.. మంచి టాక్ సంపాదించుకోవాలన్నా.. కథ బావుండాలి. కథ బావుంటేనే ఆ సినిమాలో ఉన్న ప్రతి ఆర్టిస్ట్ ఎంత నటించినా గుర్తిస్తారు జనాలు. అలాంటిది కథ లేకుండా లాజిక్ లేని సినిమాలు చేసి.. క్రేజ్, ఇమేజ్, స్టార్ డమ్ తో ఏదో లాగించేద్దామనుకున్న తమిళ్ స్టార్ హీరోలు బొక్క బోర్లా పడుతున్నారు. వరస ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్నారు.

Tamil Film Releases: వరసగా రిలీజ్.. సినిమాలతో తమిళ తంబీల దండయాత్ర!

తమిళ్ ఇండస్ట్రీలో ఎంత కల్ట్ సినిమాలు వస్తాయో.. దానికి కాంట్రాస్ట్ గా అంతే కమర్షియల్ సినిమాలొస్తాయి. అయితే ఈమధ్య స్టార్ హీరోలు పెద్దగా కథ మీద కాన్సన్ ట్రేట్ చెయ్యడం లేదు. ఏదోక యాక్షన్ మూవీ చేసి థియేటర్లోకి వదిలేస్తే.. చూసేస్తార్లే అనుకుంటున్నారు స్టార్లు. కానీ సీన్ రివర్స్ అవుతోంది. లేటెస్ట్ గా అజిత్ భారీ బడ్జెట్ తో రేసింగ్ రాబరీ బ్యాక్ డ్రాప్ తో చేసిన సినిమా వలిమై అస్సలు ఆడియన్స్ ని ఆకట్టుకోలేకపోయింది. ఎన్నో ఎక్స్ పెక్టేషన్స్ మద్య హ్యూమాఖురేషి, కార్తికేయ లాంటి స్టార్ కాస్ట్ తో పాటు అజిత్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ చేసిన వలిమై మూవీ అనుకున్నంత సక్సెస్ కాలేకపోయింది. సినిమా మొత్తం యాక్షన్ సీన్స్ తో నింపెయ్యడంతో పాటు.. స్టోరీ లైన్ స్ట్రాంగ్ గా లేకపోవడంతో సినిమా హిట్ ఇవ్వలేకపోయింది.

Tamil Heros : ఓటీటీ బాట పడుతున్న తమిళ స్టార్ హీరోలు

సూపర్ స్టార్ రజనీకాంత్ అయితే వరస డిజాస్టర్లని ఫేస్ చేస్తున్నారు. ఈమధ్య కాలంలో రజనీకాంత్ చేసిన కాలా, కబాలి, పెద్దన్న లాంటి భారీ సినిమాలు కూడా ఫ్లాపులయ్యాయి. కథని పక్కనపెట్టి ఎలివేషన్ మీదే కాన్సన్ ట్రేట్ చెయ్యడంతో.. సినిమా అడ్రస్ లేకుండాపోతోంది. సంక్రాంతి కి రిలీజ్ అయిన పెద్దన్నలో కూడా భారీ స్టార్ కాస్ట్ అయితే పెట్టారు కానీ.. పాత కథనే మళ్లీ కొత్త ఆర్టిస్టులతో ప్రెజెంట్ చేసినట్టే ఫీలయ్యారు ఆడియన్స్. అందుకే హై ఎక్స్ పెక్టేషన్స్ తో రజనీ మార్క్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా వచ్చిన పెద్దన్న కూడా ఫ్లాప్ అయ్యాడు.

Tamil Star Hero’s: తమిళ తంబీల బిగ్ గేమ్.. వచ్చే ఏడాదికి మాస్టర్ ప్లాన్

ఇక స్టార్ హీరో కమల్ హాసన్ సంగతి సరేసరి. సినిమాని ఎంత గ్రాండ్ గా తీస్తే.. అంత గొప్ప అనుకుంటున్నారు. ఏదో ప్రయోగాలు చేద్దామని చూస్తూ.. అసలు కథనే పక్కకు పెట్టేస్తున్నారు. విశ్వరూపం1, 2తో డిజాస్టర్ ఫేస్ చేసిన కమల్ హాసన్.. ఈ సినిమాల్లో తన క్యారెక్టర్లు, గెటప్ ల మీదే కాన్సన్ ట్రేట్ చేసి సినిమా ప్లాట్ ని పట్టించుకోలేదు. దాంతో డిజాస్టర్ ఫేస్ చేశారు. మళ్లీ 4 ఏళ్ల గ్యాప్ తర్వాత ఫహాద్ ఫాజిల్, విజయ్ సేతుపతి లాంటి స్టార్ కాస్ట్ తో విక్రమ్ అనే భారీ సినిమా చేస్తున్నారు.

Tamil Hero’s: టాలీవుడ్ పై కన్నేసిన తమిళ తంబీలు.. స్ట్రైట్ సినిమాలపై ఆసక్తి!

స్కెచ్, సామి స్క్వేర్, కె.కె లాంటి యాక్షన్ మూవీస్ అంతగా ఆకట్టుకోలేకపోయిన టాప్ హీరో విక్రమ్ కూడా వరసగా ఫ్లాపుల్లో ఉన్నారు. తనకున్న యాక్షన్ ఇమేజ్ ని కంటిన్యూ చెయ్యడం కోసం కథను డామినేట్ చేసేలా క్యారెక్టర్లు చేస్తున్న విక్రమ్.. ఇలాంటి సినిమాలతోఆడియన్స్ కి దూరమవుతున్నాడు. ఈమధ్య చేసిన మహాన్ మూవీ కూడా ఆడియన్స్ కి తెలిసిన పాత విక్రమ్ నే తెరమీద చూపించింది. ఇలా ఎంత పెద్ద స్టార్ హీరో అయినా కథ లేకపోతే.. సినిమాలు ఫ్లాపులవుతున్నాయనడానికి ఎగ్జాంపుల్ అవుతున్నారు తమిళ్ హీరోలు.