Tammareddy Bharadwaj : పాన్ ఇండియా సినిమాలకి వందల కోట్లు ఎందుకు? మేజర్ సినిమా చూసి నేర్చుకోండి..

తమ్మారెడ్డి తన ఛానల్ లో రిలీజ్ చేసిన ఓ వీడియోలో మాట్లాడుతూ.. ''నేను తాజాగా మేజర్‌ సినిమా చూశాను. సినిమా చాలా బాగా తీశారు. నటీనటులందరూ చక్కగా నటించారు. నిర్మాణ విలువలు.........

Tammareddy Bharadwaj : పాన్ ఇండియా సినిమాలకి వందల కోట్లు ఎందుకు? మేజర్ సినిమా చూసి నేర్చుకోండి..

Tammareddy

Tammareddy Bharadwaj :  ఇటీవల అందరూ పాన్ ఇండియా సినిమాల గురించి మాట్లాడుతున్న సంగతి తెలిసిందే. అందరూ మన పాన్ ఇండియా సినిమాలని అభినందిస్తున్నారు. అయితే పాన్ ఇండియా సినిమాలని చెప్పి సినిమా బడ్జెట్ లు కూడా పెంచుతున్నారు. బడ్జెట్ లు పెరిగాయని టికెట్ ధరలు కూడా పెంచుతున్నారు. దీనివల్ల థియేటర్ కి వచ్చే జనాలు తగ్గుతున్నారు. తాజాగా పాన్ ఇండియా సినిమాలకి అంత బడ్జెట్ లు ఎందుకు అంటూ ప్రముఖ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ మాట్లాడుతూ ఓ వీడియో రిలీజ్ చేశారు.

 

తమ్మారెడ్డి తన ఛానల్ లో రిలీజ్ చేసిన ఓ వీడియోలో మాట్లాడుతూ.. ”నేను తాజాగా మేజర్‌ సినిమా చూశాను. సినిమా చాలా బాగా తీశారు. నటీనటులందరూ చక్కగా నటించారు. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. చిత్రబృందం మొత్తానికి నా అభినందనలు. ఈ మధ్య మనం ఎక్కువగా పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌, పాన్‌ ఇండియా సినిమా అని చెబుతున్నాం. నిజంగా చెప్పాలంటే మేజర్‌ పాన్‌ ఇండియా కథ. కొంతమంది నటులు, నిర్మాతలు తమది పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌. బడ్జెట్‌ భారీగా అయ్యింది, లాస్‌లు వస్తున్నాయి కాబట్టి మేము సినిమా టికెట్‌ రేట్లు పెంచుకునేలా అవకాశం కల్పించండి అంటూ ముఖ్యమంత్రులను కోరారు.”

Nayan-Vignesh : పెళ్లి నుంచి డైరెక్ట్ గా తిరుమలకి నయన్-విగ్నేష్

”అలాంటి పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌లకు మేజర్‌ సినిమా ఏమాత్రం తీసిపోదు. టెక్నికల్‌, క్వాలిటీపరంగా సినిమా చాలా బాగుంది. ఈ చిత్రాన్ని కేవలం 25కోట్లలోపే పూర్తి చేసి పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేసి మంచి విజయం సాధించారు. మరి మిగిలిన ప్రాజెక్ట్‌లకు ఎందుకు వందల కోట్లు ఖర్చు చేస్తున్నారు. మేజర్‌ లాంటి చిత్రానికి ఖర్చు అవ్వలేదు మీకు ఎందుకు అవుతుంది? నిర్మాతలు, హీరోలు ఆలోచించాలి. షూటింగ్‌ అని చెప్పి క్యారవాన్‌లో కూర్చుంటున్నారా? సినిమా చేస్తే ప్యాషన్‌తో చేయాలి. సమయాన్ని వేస్ట్ చేసి డబ్బులని వృథా చేస్తున్నారు” అంటూ సీరియస్ గా మాట్లాడారు.