కరోనా గురించి మాట్లాడుతూ రాహుల్‌‌పై తమ్మారెడ్డి పంచ్

కరోనా వైరస్, థియేటర్లు మూసివేత గురించి స్పందించిన తమ్మారెడ్డి భరద్వాజ..

  • Published By: sekhar ,Published On : March 5, 2020 / 01:46 PM IST
కరోనా గురించి మాట్లాడుతూ రాహుల్‌‌పై తమ్మారెడ్డి పంచ్

కరోనా వైరస్, థియేటర్లు మూసివేత గురించి స్పందించిన తమ్మారెడ్డి భరద్వాజ..

కరోనా వైరస్ కారణంగా ప్రపంచంలోని సినిమా థియేటర్లు మూతపడబోతున్నాయా?.. అంటే అవును అనే సమాధానం వినిపిస్తోంది. గతకొద్ది రోజులుగా కరోనా వైరస్ (కోవిడ్ -19)  ప్రపంచాన్ని గజగజ వణికిస్తుంది. హైదరాబాద్లో కూడా కరోనా కేసులు నమోదు కావడంతో ప్రజల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. కరోనా అనుమానితులతో ఆసుపత్రులు నిండిపోయాయి. ఈ సందర్భంగా ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రభుత్వం కార్యచరణ సిద్ధం చేస్తోంది. ప్రముఖుల చేత ప్రచారం చేపట్టాలని నిర్ణయించింది.

ఉపాసన, మహేష్ బాబు, వరుణ్ తేజ్ వంటి పలువురు సెలబ్రిటీలు కరోనా గురించి ప్రజలు భయపడొద్దని సోషల్ మీడియా ద్వారా సందేశాలిచ్చారు. పలు సినిమాల షూటింగులూ కరోనా కారణంగా వాయిదా పడ్డాయి. కొన్ని రోజులు థియేటర్లు మూతపడతాయా? అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే కరోనా పుట్టినిల్లు చైనాలో కొన్ని ప్రాంతాలలో థేయేటర్లు మూసేసిన సంగతి తెలిసిందే. కరోనా కారణంగా సినిమా థియేటర్లు మూసివేయనున్నారనే వార్తపై ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ 10 టివితో మాట్లాడారు..

‘మొన్న స్వైన్‌ఫ్లు, నేడు కరోనా.. ఇలా ఏదో ఒక వైరస్ వస్తూనే ఉంటుంది. ఇవన్నీ మామూలుగా జరిగేవే.. కాకపోతే జాగ్రత్తగా ఉండాలి.. థియేటర్స్ మూసేసినంత మాత్రాన సమస్య పరిష్కారం కాదు. బస్టాండ్స్, ఆఫీస్‌లు, స్కూల్స్, కాలేజెస్, రైల్వే స్టేషన్స్, షాపింగ్ కాంప్లెక్స్, పబ్స్ (రాత్రి పబ్బులో ఎవరో కొట్టుకోవడం మనం చూసాం.. అంటూ రాహుల్ సిప్లిగంజ్ వివాదం గురించి ఇన్‌డైరెక్ట్‌గా ప్రస్తావించారు) ఇలా అన్ని చోట్లా పబ్లిక్ ఉంటారు.. అలాంటప్పుడు ఒక్క సినిమా థియేటర్స్ మూసేస్తారు అనే వార్త అవాస్తవం.. కాకపోతే ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి’ అని సూచించారు.