RRR : RRR మూవీ‎పై చేసిన వ్యాఖ్యలపై తమ్మారెడ్డి రియాక్షన్..

ఇటీవల తమ్మారెడ్డి భరద్వాజ్ RRR పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలు టాలీవుడ్ లో దుమారాన్ని లేపడంతో తమ్మారెడ్డి వివరణ ఇచ్చాడు.

RRR : RRR మూవీ‎పై చేసిన వ్యాఖ్యలపై తమ్మారెడ్డి రియాక్షన్..

Tammareddy's reaction on his comments on RRR movie

RRR : రాజమౌళి తెరకెక్కించిన RRR చిత్రం ప్రస్తుతం ఆస్కార్ కి పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. ఆస్కార్ గెలిచేందుకు మూవీ టీం గత కొంత కాలంగా అమెరికాలో ప్రమోషన్స్ నిర్వహిస్తూ వస్తున్నారు. కాగా ఈ ప్రమోషన్స్ గురించి టాలీవుడ్ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఈ మూవీ ఆస్కార్ ప్రమోషన్స్ కోసం రాజమౌళి 80 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నాడు. సూట్లు వేసుకొని, ఫ్లైట్స్ టికెట్స్ వేసుకొని డబ్బులు ఖర్చు చేస్తున్నారు. అదే 80 కోట్లు నాకు ఇస్తే ఓ 8 సినిమాలు తీసి మొహాన కొడతాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యలు కాస్త టాలీవుడ్ వివాదానికి దారి తీశాయి.

Tammareddy Bharadwaja : RRR పై సంచలన కామెంట్స్ చేసిన తమ్మారెడ్డి.. కౌంటర్ ఇచ్చిన రాఘవేంద్రరావు, నాగబాబు..

టాలీవుడ్ లోని ప్రముఖులు కూడా ఈ వ్యాఖ్యలను తప్పుబడుతున్నారు. ఈ క్రమంలోనే దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు.. రాజమౌళి అకౌంట్ వివరాలు నీకేమన్నా తెలుసా అని ప్రశ్నించగా, మెగా బ్రదర్ నాగబాబు.. నీయమ్మ మొగుడు ఖర్చు పెట్టాడారా 80 కోట్లు RRR కి ఆస్కార్ కోసం అంటూ ఘాటుగా ప్రశ్నించాడు. దీంతో తమ్మారెడ్డి రియాక్ట్ అయ్యాడు.

ఒక సెమినార్ లో భాగంగా పరిశ్రమకు రావాలి అనుకుంటున్న కొంతమంది స్టూడెంట్స్ తో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. ఈ క్రమంలోనే రిలీజ్ అయ్యాక పేరు వచ్చే సినిమాలు, రిలీజ్ కి ముందే పేరు సంపాదించే సినిమాలు, అవార్డులు, రివార్డులు కోసం తీసే సినిమాలు అంటూ వివరణ ఇచ్చే సమయంలో.. ప్రస్తుతం RRR మూవీ ఆస్కార్ ప్రమోషన్స్ కోసం 80 కోట్లకు ఖర్చు చేస్తుంది అంటూ వ్యాఖ్యానించాను. కానీ ఆ ముందు మాట్లాడిన మాటలు ఏమి పట్టించుకోకుండా, కేవలం ఖర్చు చేశారు అనే ఒక పదాన్ని తీసుకోని పలువురు ప్రముఖులు కూడా అకౌంట్స్ తెలుసా, అమ్మా మొగుడు ఖర్చు చేశాడు అంటూ వ్యాఖ్యానిస్తున్నారు.

RRR : ఆస్కార్ కోసం 80 కోట్లు ఖర్చుపెట్టారు.. 8 సినిమాలు తీసి వాళ్ళ మొహాన కొడతాను.. RRR యూనిట్ పై తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు..

రెండు వారలు క్రితం నా యూట్యూబ్ ఛానల్ లో రాజమౌళిని పొగుడుతూ ఒక వీడియో చేశా.. మన ఆలోచనలో కూడా లేని ఆస్కార్ వరకు నేడు రాజమౌళి వెళ్ళాడు. 99 శాతం గెలిచే అవకాశం కూడా ఉంది అంటూ మాట్లాడినప్పుడు ఒక్కడు నా గురించి మాట్లాడలేదు. ఇప్పుడు ఏదో ఫేమ్ కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారా? అంటూ తిరిగి ప్రశ్నించాడు.