అంచనాలు పెంచేసిన ‘తానాజీ : ది అన్‌సంగ్ వారియర్’ - ట్రైలర్

అంచనాలు పెంచేసిన ‘తానాజీ : ది అన్‌సంగ్ వారియర్’ – ట్రైలర్

అజయ్ దేవ్‌గన్, సైఫ్ అలీఖాన్, కాజోల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న హిస్టారికల్ మూవీ.. ‘తానాజీ : ది అన్‌సంగ్ వారియర్’ థియేట్రికల్ ట్రైలర్ విడుదల..

అంచనాలు పెంచేసిన ‘తానాజీ : ది అన్‌సంగ్ వారియర్’ – ట్రైలర్

అజయ్ దేవ్‌గన్, సైఫ్ అలీఖాన్, కాజోల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న హిస్టారికల్ మూవీ.. ‘తానాజీ : ది అన్‌సంగ్ వారియర్’ థియేట్రికల్ ట్రైలర్ విడుదల..

అజయ్ దేవ్‌గన్, సైఫ్ అలీఖాన్, కాజోల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న హిస్టారికల్ మూవీ.. ‘తానాజీ : ది అన్‌సంగ్ వారియర్’.. అజయ్ హీరోగా నటిస్తున్న 100వ సినిమా ఇదే కావడం విశేషం.. ఓం రౌత్ దర్శకత్వంలో, అజయ్ దేవ్‌గన్ ఫిల్మ్స్, టీ-సిరీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

సోమవారం ఈ సినిమాలోని కాజోల్ లుక్ రిలీజ్ చేసిన మూవీ టీమ్, మంగళవారం ‘తానాజీ : ది అన్‌సంగ్ వారియర్’ థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేశారు. శివాజీ మహారాజ్‌తో కలిసి మరాఠా ప్రజల స్వాతంత్ర్యం కోసం పోరాడిన సైన్యాధ్యక్షుడు తనాజీ మలుసరేగా అజయ్, అతని భార్య సావిత్రి ములుసరేగా కాజోల్ నటించగా, సైఫ్ అలీఖాన్ ఉదయ్ భాన్ అనే నెగెటివ్ క్యారెక్టర్ చేశాడు.

Read Also : ‘సరిలేరు నీకెవ్వరు’ టీజర్ వచ్చేస్తోంది!

ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేసింది.. నటీనటుల పెర్ఫార్మెన్స్, విజువల్స్, ఆర్ఆర్, ఆర్ట్ వర్క్, వీఎఫ్ఎక్స్ చాలా బాగా కుదిరాయి.. సంక్రాంతి కానుకగా 2020 జనవరి 10న ‘తానాజీ : ది అన్‌సంగ్ వారియర్’ ప్రేక్షకుల ముందుకు రానుంది. సంగీతం : అజయ్-అతుల్, ఫోటోగ్రఫీ : కేయికో నకహర, ఎడిటింగ్ : ధర్మేంద్ర శర్మ, నిర్మాతలు : అజయ్ దేవ్‌గన్, భూషణ్ కుమార్, కృష్ణన్ కుమార్.
 

×