పోస్టర్ పర్లేదు.. ఈ సారైనా హిట్ కొడతాడా?

తనీష్, ముస్కాన్ సేథీ (పైసా వసూల్ ) ఫేమ్ జంటగా నటిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్.. ‘మహాప్రస్థానం’ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌ విడుదల..

  • Published By: sekhar ,Published On : March 23, 2020 / 09:43 AM IST
పోస్టర్ పర్లేదు.. ఈ సారైనా హిట్ కొడతాడా?

తనీష్, ముస్కాన్ సేథీ (పైసా వసూల్ ) ఫేమ్ జంటగా నటిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్.. ‘మహాప్రస్థానం’ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌ విడుదల..

“గుండె కన్నీరైతే.. ఆవేశం ఆయుధమైతే..ఆ కత్తి రాసే రుధిర కావ్యమే ఈ మహాప్రస్థానం” అంటూ మహాప్రస్థానం మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. ‘ది జర్నీ ఆఫ్ ఆన్ ఎమోషనల్ కిల్లర్’ ట్యాగ్ లైన్‌తో తనీష్ హీరోగా వస్తున్న ‘మహాప్రస్థానం’ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌లను చిత్ర బృందం తాజాగా విడుదల చేసింది. కత్తి పట్టుకున్న తనీష్ శత్రువులను తుదముట్టిస్తూ వయలెంట్ లుక్‌లో కనిపించాడు. భావోద్వేగం నిండిన వాయిస్ ఓవర్‌తో మొదలైన మోషన్ పోస్టర్… మహాప్రస్థానం టైటిల్ సాంగ్ బిట్‌తో పూర్తయింది.

సినిమా కథలోని లోతును, ఎమోషనల్ కిల్లర్‌గా తనీష్ పాత్రలోని ఫైర్‌ను మోషన్ పోస్టర్ చూపించింది. ఓంకారేశ్వర క్రియేషన్స్ పతాకంపై దర్శకుడు జాని ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ‘పైసా వసూల్’ ఫేమ్ ముస్కాన్ సేథీ నాయికగా నటిస్తోంది. ‘వరుడు’ ఫేమ్ భానుశ్రీ మెహ్రా, కబీర్ దుహాన్ సింగ్, రాజా రవీంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు. మంచి క్వాలిటీతో శరవేగంగా చిత్రీకరణ పూర్తి చేసుకున్న మహాప్రస్థానం సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా వేగంగా జరుపుకుంటోంది. ప్రస్తుతం రీరికార్డింగ్ పనుల్లో ఉన్న ఈ సినిమా వేసవిలో విడుదలకు సిద్ధమవుతోంది.

ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ విడుదల సందర్భంగా దర్శకులు జాని మాట్లాడుతూ : ‘‘ది జర్నీ ఆఫ్ ఆన్ ఎమోషనల్ కిల్లర్’ అనే ట్యాగ్ లైన్‌కు సరిగ్గా సరిపోయే సినిమా ‘మహాప్రస్థానం’. ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌లను విడుదల చేశాం. తనీష్ పాత్రలోని ఇంటెన్సిటీని ప్రేక్షకులు కొత్తగా ఫీలవుతారు. కిల్లర్‌గా తనీష్ నటన సినిమాకు ప్రధాన ఆకర్షణ అవుతుంది. కథలోని బలం మా అందరికీ ఇంత ఎనర్జీని ఇచ్చి పనిచేసేలా చేస్తోంది. ఇదొక అసాధారణ సినిమా అని చెప్పాలనే కొత్తగా మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్ చేయించాం. గెరిల్లా పద్ధతిలో శరవేగంగా చిత్రీకరణ పూర్తి చేశాం. ఇప్పుడు ఫుల్ స్వింగ్‌లో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నాం. సాధ్యమైనంత త్వరగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసి, సమ్మర్‌లో ‘మహాప్రస్థానం’ చిత్రాన్ని విడుదల చేయబోతున్నాం’’ అన్నారు.