Tapsee : నేను, సమంత కలిసి పనిచేయబోతున్నాం..

తాప్సీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ''సమంత, నేను కలిసి పనిచేయబోతున్నాం. ఆ ప్రాజెక్ట్‌ను త్వరలోనే ప్రకటిస్తాం. అందులో సమంత మెయిన్ లీడ్ చేస్తుంది. నేను...........

Tapsee : నేను, సమంత కలిసి పనిచేయబోతున్నాం..

Tapsee

Tapsee :  సినీ పరిశ్రమలో హీరోలు, హీరోయిన్స్ లో మంచి ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. స్టార్స్ అయినా వారిలో వాళ్ళు కలివిడిగా ఉంటారు, కలిసి సినిమాలు చేస్తారు. తాజాగా ఓ ఇద్దరు హీరోయిన్స్ కలిసి సినిమా చేస్తా అంటున్నారు. హీరోయిన్ తాప్సీ ప్రస్తుతం మిథాలీ రాజ్ బయోపిక్ ‘శభాష్‌ మిథూ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు త్వరలో రాబోతుంది. తెలుగులో వరుస సినిమాలు చేసినా సక్సెస్ రేట్ తక్కువగా ఉన్నా బాలీవుడ్ కి వెళ్లి అక్కడ కూడా వరుస సినిమాలు చేస్తుంది. తాజాగా తాప్సీ ఓ బాలీవుడ్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాన్నీ తెలియచేసింది.

Upasana : పిల్లలు, ప్రెగ్నెన్సీపై ఉపాసన వ్యాఖ్యలు.. పిల్లలు లేకపోయినా పర్లేదు అన్న సద్గురు..

తాప్సీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ”సమంత, నేను కలిసి పనిచేయబోతున్నాం. ఆ ప్రాజెక్ట్‌ను త్వరలోనే ప్రకటిస్తాం. అందులో సమంత మెయిన్ లీడ్ చేస్తుంది. నేను నిర్మాతగా వ్యవహరిస్తాను. ఒకవేళ దాంట్లో నేను చేయగలిగే క్యారెక్టర్ ఏదైనా ఉంటే కచ్చితంగా చేస్తాను. ఈ ప్రాజెక్ట్‌ ని నిర్మించడం సంతోషంగా భావిస్తున్నాను” అని తెలిపింది. తాప్సీ, సమంత కలిసి ఒక సినిమా చేయబోతున్నారు అని ప్రకటించడంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.