‘RX 100’ హిందీ రీమేక్ కు టైటిల్ ఫిక్స్ !

  • Published By: veegamteam ,Published On : March 28, 2019 / 09:17 AM IST
‘RX 100’ హిందీ రీమేక్ కు టైటిల్ ఫిక్స్ !

తెలుగులో కార్తికేయ, పాయల్ రాజ్ పుత్ హీరో హీరోయిన్లుగా అజయ్ భూపతి డైరెక్షన్ లో వచ్చిన బోల్డ్ లవ్ స్టోరీ ‘RX 100’. ఈ సినిమా గతేడాది విడుదలై బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలన విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు ఈ సినిమా హిందీలో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరో సునీల్ శెట్టి కుమారుడు ఆహాన్ శెట్టి ఈ సినిమా తో హీరోగా పరిచయం కానున్నాడు.

మిలాన్ లుథ్రియా తెరకెక్కించనున్న ఈ చిత్రానికి ‘తడప్’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. సాజిద్ నడియాద్వాల నిర్మించనున్న ఈ చిత్రంలో తార సుతారియా హీరోయిన్ గా నటించనుంది. ఈ చిత్రం మే లో సెట్స్ పైకి వెళ్లనుంది. మరి ఈ చిత్రం బాలీవుడ్ లో ఎలాంటి రెస్పాన్స్ ను తెచ్చుకుంటుందో చూడాలి.