Janatha Garage: బాలీవుడ్‌కి తారక్ సినిమా.. సల్లూభాయ్ హీరో?

తెలుగు సినిమా ఖ్యాతి ఇప్పుడు ఖండాంతరాలు దాటింది. తెలుగులో విడుదలయ్యే సినిమాలే కాదు గత పదేళ్లలో హిట్స్ సాధించిన సినిమాలపై కూడా వివిధ బాషలలో దర్శక, నిర్మాతలు కన్నేసి ఉంచారు. ఇక బాలీవుడ్ అయితే.. దక్షణాదిలో స్టార్ హీరోల సక్సెస్ సినిమాలను ఎగరేసుకుపోతుంది. ఇప్పటికే ఎన్నో సినిమాలు బాలీవుడ్ లో రీమేక్ కాగా ఇప్పుడు తారక్ జనతా గ్యారేజ్ వంతు వచ్చింది.

Janatha Garage: బాలీవుడ్‌కి తారక్ సినిమా.. సల్లూభాయ్ హీరో?

Janatha Garage

Janatha Garage: తెలుగు సినిమా ఖ్యాతి ఇప్పుడు ఖండాంతరాలు దాటింది. తెలుగులో విడుదలయ్యే సినిమాలే కాదు గత పదేళ్లలో హిట్స్ సాధించిన సినిమాలపై కూడా వివిధ బాషలలో దర్శక, నిర్మాతలు కన్నేసి ఉంచారు. ఇక బాలీవుడ్ అయితే.. దక్షణాదిలో స్టార్ హీరోల సక్సెస్ సినిమాలను ఎగరేసుకుపోతుంది. ఇప్పటికే ఎన్నో సినిమాలు బాలీవుడ్ లో రీమేక్ కాగా ఇప్పుడు తారక్ జనతా గ్యారేజ్ వంతు వచ్చింది.

ఎన్టీఆర్.. కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా జనతా గ్యారేజ్ టాలీవుడ్ భారీ సక్సెస్ సినిమాలలో ఒకటిగా నిలిచిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ మేనరిజంకు తోడు.. కొరటాల సోషల్ మెసేజ్ తోడై సినిమా ఎక్కడా బ్యాలెన్స్ తగ్గకపోవడం విమర్శకులను ఆకట్టుకుంది. ఇక మోహన్ లాల్ నటన ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఈ సినిమా ఇప్పుడు బాలీవుడ్ కు వెళ్లేందుకు సిద్ధమైంది. గత మూడేళ్ళగా ఈ సినిమా హిందీ రీమేక్ పై చర్చలు జరుగుతుండగా ఒరిజినల్ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ అందుకు సిద్ధమైంది.

ఇప్పటికే మైత్రి మూవీ మేకర్స్ ఇటీవల ఒక బాలీవుడ్ హీరోకు అడ్వాన్స్ కూడా ఇచ్చినట్లు టాక్ వస్తోంది. ఆ స్టార్ హీరో కండల వీరుడు సల్మాన్‌ ఖానే అని టాలీవుడ్ లో బలంగా ప్రచారం జరుగుతుంది. మైత్రి మూడేళ్లుగా ఈ ఆలోచనలో ఉన్నా రకరకాల కారణాలతో అది వాయిదా పడింది. అయితే.. ఇప్పుడు మైత్రీ వారు పాన్ ఇండియా సినిమాల మీద దృష్టిపెట్టగా ముందుగా బాలీవుడ్ లో కూడా ఓ స్ట్రైట్ సినిమాకు సిద్ధమైంది. దీనికి సంబంధించి ఇప్పటికే అగ్రిమెంట్‌ కూడా రూపొందినట్లు చెప్తుండగా ఈ మూవీకి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుందని చెప్తున్నారు.