Tarakarathna : అసలు నేను ఎన్టీఆర్‌కి పోటీనే కాదు.. నందమూరి వంశం ఎన్టీఆర్ వల్లే నిలబడుతుంది..

తారకరత్న మాట్లాడుతూ.. ''తార‌క్ సినిమాల్లోకి వచ్చాకే నేను సినిమాల్లోకి వ‌చ్చాను. నేను సినిమాల్లోకి వచ్చేసరికే తమ్ముడికి ‘ఆది’ లాంటి పెద్ద హిట్ సినిమా ఉంది. నేను, ఎన్టీఆర్‌కు ఎప్పటికి.............

Tarakarathna : అసలు నేను ఎన్టీఆర్‌కి పోటీనే కాదు.. నందమూరి వంశం ఎన్టీఆర్ వల్లే నిలబడుతుంది..

Ntr

NTR :  ‘ఒక‌టో నెంబ‌ర్ కుర్రాడు’ సినిమాతో మరో నంద‌మూరి వార‌సుడిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు తారకరత్న. ఈ సినిమాతో పాటు తను చేసిన ‘యువ‌రత్న‌’, ‘భ‌ద్రాద్రి రాముడు’ సినిమాలు పర్వాలేదనిపించాయి. ఇక తారకరత్న చేసిన మిగిలిన సినిమాలన్నీ ఫ్లాపులుగానే మిగిలాయి. వ‌రుస ఫ్లాప్‌లు రావడంతో హీరో కెరీర్ ముగిసింది. ఆ తర్వాత అప్పుడప్పుడు విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటిస్తూ మెప్పిస్తున్నాడు.

తాజాగా తారకరత్న 9 హవర్స్ అనే వెబ్ సిరీస్ లో నటించాడు. ఈ సిరీస్ హాట్ స్టార్ లో టెలికాస్ట్ అవుతుంది. ఈ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా తారకరత్న చాలా రోజుల తర్వాత మీడియా ముందుకి వచ్చాడు. ఈ సిరీస్ కోసం పలు ఇంటర్వ్యూలు ఇవ్వగా ఎన్టీఆర్ గురించి, నందమూరి ఫ్యామిలీ గురించి ఆసక్తికర విషయాలు తెలియచేశాడు.

Samantha : విజయ్‌తో సమంత నాలుగోసారి??

తారకరత్న మాట్లాడుతూ.. ”తార‌క్ సినిమాల్లోకి వచ్చాకే నేను సినిమాల్లోకి వ‌చ్చాను. నేను సినిమాల్లోకి వచ్చేసరికే తమ్ముడికి ‘ఆది’ లాంటి పెద్ద హిట్ సినిమా ఉంది. నేను, ఎన్టీఆర్‌కు ఎప్పటికి కాంపిటీష‌న్ కాదు. ఎన్టీఆర్ గ్రేట్ ఆర్టిస్టు. ఇవాళ నందమూరి ఫ్యామిలీ నిల‌బ‌డుతుందంటే దానికి కారణం ఎన్టీఆర్. నేను హీరో కావాలనుకున్నాను. అందుకు నాన్న, బాబాయ్ లు సపోర్ట్ ఇచ్చారు. మా నందమూరి ఫ్యామిలిలో ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఎవరు సక్సెస్ సాధించినా అది నందమూరి వంశానికే చెందుతుంది. తార‌క్ స‌క్సెస్‌ను చూసి ఒక అన్న‌గా ఆనందిస్తున్నాను” అని తెలిపాడు.