Balakrishna : మా ఫ్యామిలీ అని చెప్పుకునేది ఆయనని మాత్రమే.. తారకరత్న భార్య పోస్ట్!

నందమూరి హీరో తారకరత్న ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. ఇక తారకరత్న భార్య, పిల్లలు అయితే తారకరత్న మరణాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు. దీంతో సోషల్ మీడియాలో తారకరత్న గురించి వరుస పోస్ట్ లు వేస్తున్నారు. తాజాగా ఆమె వేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.

Balakrishna : మా ఫ్యామిలీ అని చెప్పుకునేది ఆయనని మాత్రమే.. తారకరత్న భార్య పోస్ట్!

Balakrishna : నందమూరి హీరో తారకరత్న ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. రాజకీయవేత్తగా కూడా చురుకుగా ఉండే తారకరత్న.. జనవరి నెలలో టీడీపీ లీడర్ నారా లోకేష్ మొదలుపెట్టిన పాదయాత్రలో పాల్గొన్నారు. ఆ యాత్రలో హార్ట్ ఎటాక్ రావడంతో నడుస్తూ నడుస్తూనే కుప్పకూలిపోగా.. బెంగుళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ కి తరలించారు. ఇక ఆ హాస్పిటల్ వెంటిలేటర్ పై దాదాపు 23 రోజులు పాటు మృత్యువుతో పోరాడిన తారకరత్న ఫిబ్రవరి 18న తుదిశ్వాస విడిచారు. తారకరత్న మరణం నందమూరి కుటుంబాన్ని శోకసంద్రంలోకి నెట్టేసింది.

Balakrishna: గాలా విత్ బాలా.. బాలయ్య మేకోవర్ చూసి నోరెళ్లబెడుతున్న ఫ్యాన్స్!

ఇక తారకరత్న భార్య, పిల్లలు అయితే తారకరత్న మరణాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు. దీంతో సోషల్ మీడియాలో తారకరత్న గురించి వరుస పోస్ట్ లు వేస్తున్నారు. తాజాగా ఆమె వేసిన పోస్ట్ వైరల్ అవుతుంది. తారకరత్న పిల్లలతో బాలకృష్ణ ఫోటోని ఒక నెటిజెన్ ఎడిట్ చేసి తరరత్నని కూడా ఒక ఫొటోలో వచ్చేలా చేశాడు. ఆ ఫోటోని తారకరత్న భార్య అలేఖ్యరెడ్డి షేర్ చేస్తూ.. మా కుటుంబం అని చెప్పుకొనే వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే అది బాలకృష్ణ గారే.

Balakrishna : ఆహా వేదిక పై మరోసారి బాలయ్య హోస్టింగ్.. కానీ అన్‌స్టాపబుల్‌కి కాదు!

సుఖ, దుఃఖాల్లో ధైర్యంగా చివరి వరకు వెంట ఉన్న వ్యక్తి ఆయన, ఒక తండ్రిలా హాస్పిటల్ లో దగ్గర ఉండి చూసుకున్న వ్యక్తి ఆయన, అమ్మలా నవ్విస్తూ, నిద్రపుస్తూ.. చుట్టూ ఎవరు లేనప్పుడు మా కోసం కన్నీరు కార్చే వ్యక్తి ఆయన. ఈ ఫోటోని ఎవరైతే ఎడిట్ చేసారో వాళ్ళకి చాలా పెద్ద థాంక్యూ అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది. కాగా ప్రస్తుతం తారకరత్న పిల్లల భాద్యత బాలకృష్ణ తీసుకున్నాడు. వారి భవిషత్తు తన భాద్యత అంటూ బాలకృష్ణ, ఎంపీ విజయ్ సాయి రెడ్డికి మాట ఇచ్చిన విషయం తెలిసిందే.

 

View this post on Instagram

 

A post shared by Alekhya Tarak Ratna (@alekhyarede)