South Heroins: టార్గెట్ బాలీవుడ్.. సౌత్ గర్ల్స్ అడ్డాగా మారిన బీటౌన్!

ముంబై వీధుల్ని సౌత్ హీరోయిన్స్ చుట్టేస్తున్నారు. అక్కడ పాగా వేయడానికి గట్టిగా ట్రై చేస్తున్నారు. జిమ్ లు, పబ్ లు, పార్టీలంటూ బాలీవుడ్ అడ్డాలో ఫుల్ గా తిరిగేస్తున్నారు.

South Heroins: టార్గెట్ బాలీవుడ్.. సౌత్ గర్ల్స్ అడ్డాగా మారిన బీటౌన్!

South Heroins

South Heroins: ముంబై వీధుల్ని సౌత్ హీరోయిన్స్ చుట్టేస్తున్నారు. అక్కడ పాగా వేయడానికి గట్టిగా ట్రై చేస్తున్నారు. జిమ్ లు, పబ్ లు, పార్టీలంటూ బాలీవుడ్ అడ్డాలో ఫుల్ గా తిరిగేస్తున్నారు. చినిగిన ప్యాంట్ తో ఒకరు.. క్యూట్ లుక్స్ తో మరొకరు.. ఇలా ఒకరా ఇద్దరా.. రకుల్ నుంచి మొదలెడితే సమంతా, రష్మిక, పూజా హెగ్డే.. ఇలా వరుసపెట్టి గ్లామర్ డాల్స్.. ముంబైలో తెగ హడావిడీ చేసేస్తున్నారు.

South Heroins: అప్నా టైమ్ ఆయా.. బాలీవుడ్‌లో సత్తా చూపిస్తున్న సౌత్ హీరోయిన్లు!

సౌత్, నార్త్ అని తనను వేరుచేయద్దొన్న రష్మిక. ఇండస్ట్రీ వేరియేషన్స్ చూపించకుండా అందరితో కలిసిపోతుంది. ఈమధ్య ముంబైలో తెగ చక్కర్లు కొడుతూ బాలీవుడ్ ఆడియెన్స్ ను అట్రాక్ట్ చేసే పనిలో పడింది. విక్కీ కౌశల్, వరుణ్ ధావన్ తో యాడ్ ఫిల్మ్స్ చేసిన నేషనల్ క్రష్.. అమితాబ్ తో గుడ్ బై, సిద్ధార్ద్ మల్హోత్రాతో మిషన్ మజ్ను సినిమాలు చేస్తుంది. వీలైనప్పుడల్లా పార్టీలు, ఫ్రెండ్స్ మీట్స్ అంటూ ముంబైలో చిల్ అవడం రష్మికకు అలవాటే. బాలీవుడ్ కి చెక్కేసిన రకుల్ ఇప్పటికే స్టార్ హీరోలతో యాక్ట్ చేసేస్తోంది. అటాక్, రన్ వే 34 లాంటి సినిమాలు ఆల్రెడీ రిలీజ్ కి రెడీ అయ్యాయి. ఈ మూవీ ప్రమోషన్స్ తో హడావిడీ చేస్తోన్న రకుల్ నార్త్ జనాల్ని ఆకట్టుకునే పనిలో ఉంది. చినిగిన ప్యాంట్స్, డిఫరెంట్ డ్రెస్సెస్ వేసుకుని హాట్ టాపిక్ గా నిలుస్తోంది.

North Heroins: బ్రేక్ ఇచ్చిన సౌత్ మీద నోరు పారేసుకుంటున్న నార్త్ హీరోయిన్స్!

బాలీవుడ్ లోనూ బుట్టబొమ్మ చాలా బిజీగా ఉంది. రణ్ వీర్ సింగ్ తో సర్కస్, సల్మాన్ ఖాన్ తో కభీ ఈద్ కభీ దివాలి సినిమాల్లో నటిస్తోంది. సో బాలీవుడ్ ఆడియెన్స్, స్టార్ మేకర్స్ అటెక్షన్ గ్రాబ్ చేసేందుకు టైమ్ దొరికినప్పుడల్లా ముంబై జిమ్స్ లో దర్శనమిస్తూనే ఉంటుంది. సమంతా టార్గెట్ ఇప్పుడు బాలీవుడ్ లో పాగా వేయడమే. వరుణ్ ధావన్ తో ఓ సినిమాకు కమిటైన సామ్.. రెగ్యులర్ గా ముంబై మేకర్స్ ని మీట్ అవుతోంది. ముంబైలో ఓ అడుగు, హైదరాబాద్ లో మరో అడుగు అన్నట్టు తయారైంది సమంత వ్యవహారం.