Tarun Bhaskar : అందరం కలిసి చచ్చిపోతాం కదా అన్నాడు విజయ్

పెళ్లిచూపులు సినిమాలో విజయ్ దేవరకొండతో కలిగిన ఒక అనుభవాన్ని షేర్ చేసుకున్నాడు తరుణ్ భాస్కర్. షూటింగ్ సమయంలో ట్రక్కు బ్రేకులు ఫెయిల్‌ అయిన సంఘటన గురించి..............

Tarun Bhaskar : అందరం కలిసి చచ్చిపోతాం కదా అన్నాడు విజయ్

Vijay Devarakonda (1)

Vijay Devarakonda :  పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది లాంటి సూపర్ హిట్ సినిమాలతో డైరెక్టర్ గా అలరించి, మీకు మాత్రమే చెప్తా, ఫలక్ నామా దాస్ సినిమాలతో నటుడిగా మెప్పించిన తరుణ్ భాస్కర్ ఆ తర్వాత యాంకర్ గా, సింగర్ గా, ఎడిటర్ గా కూడా ప్రేక్షకులని ఆకట్టుకున్నారు. విశ్వక్సేన్, విజయదేవరకొండ లాంటి ఇద్దరు స్టార్ హీరోలని ఇండస్ట్రీకి అందించారు తరుణ్ భాస్కర్. ప్రస్తుతం పలు సినిమాలకి రచయితగా పని చేస్తూ తన నెక్స్ట్ సినిమా ప్లాన్ లో ఉన్నాడు తరుణ్.

తాజాగా ఆలీతో సరదాగా ప్రోగ్రాంకి వచ్చిన తరుణ్ పలు ఆసక్తికర విషయాలని తెలియచేశాడు. ఈ ప్రోగ్రాంకి సంబంధించిన ప్రోమోని తాజాగా విడుదల చేశారు. ఇందులో ఆలీ అడిగిన పలు ప్రశ్నలకి సమాధానాలు ఇచ్చాడు, తన లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్స్ ని షేర్ చేసుకున్నాడు. వీటితో పాటు పెళ్లిచూపులు సినిమాలో విజయ్ దేవరకొండతో కలిగిన ఒక అనుభవాన్ని షేర్ చేసుకున్నాడు తరుణ్ భాస్కర్.

పెళ్లి చూపులు సినిమా షూటింగ్ సమయంలో ట్రక్కు బ్రేకులు ఫెయిల్‌ అయిన సంఘటన గురించి తెలిపాడు. ”షూటింగ్ జరుగుతుండగా ట్రక్కు బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. మొదట విజయ్‌ దేవరకొండ భయపడ్డాడు, కానీ తర్వాత సడన్‌గా రిలాక్స్‌ అయ్యాడు. ఆ తర్వాత దర్శి హ్యాండ్‌ బ్రేక్‌ తీస్తే అది ఊడి చేతులోకి వచ్చేసింది. మొత్తానికి ఎలాగో ట్రక్కు వెళ్లి ఒక చెట్టును ఢీ కొట్టి ఆగింది. దీంతో అందరం బతికి బయటపడ్డాం” అని తెలిపాడు.

Tarun Bhaskar : నాకు ఫ్లాప్స్ వస్తే విజయ్ దేవరకొండని వాడుకుంటాను

”అయితే నేను బతికి ఉన్నాను అనేదానికంటే అలాంటి సమయంలో విజయ్‌ అంత కూల్‌గా ఎలా ఉన్నాడో తెలుసుకోవాలన్న ఆతృత ఎక్కువై వెంటనే వెళ్లి విజయ్‌ ని అడిగాను ఎందుకంత రిలాక్స్‌ ఉన్నవని. విజయ్.. ఫస్ట్‌ స్టార్టింగ్‌ల భయం వేశింద్రా, దాని తర్వాత అందరం కలిసి చచ్చిపోతాం కదా, ఏముంది అని ఆన్సర్ ఇవ్వడంతో షాక్ అయ్యాను” అని విజయ్ గురించి చెప్పాడు తరుణ్ భాస్కర్.