Tarun : ఎంతమంది హీరోలతో ఆయన చేసినా.. ఆయన ఫస్ట్ హీరోనే నేనే..

ఈ ఈవెంట్లో తరుణ్ మాట్లాడుతూ..'' సినిమా విడుదలై 20 ఏళ్ళు అయినా ఫస్ట్ డే ఫస్ట్ షో చూసినట్టు ఉంది. నాకు బోర్ కొట్టినప్పుడల్లా ఈ సినిమా యూట్యూబ్ లో చూస్తాను. అమ్మ, ఆవకాయ్, అంజలి, నువ్వే నువ్వే ఎప్పటికీ బోర్ కొట్టవు.................

Tarun : ఎంతమంది హీరోలతో ఆయన చేసినా.. ఆయన ఫస్ట్ హీరోనే నేనే..

Tarun speech at nuvve nuvve 20 years celebrations

Tarun : తరుణ్, శ్రియ జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన మొదటి సినిమా నువ్వే నువ్వే. స్రవంతి రవికిశోర్ ఈ సినిమాని నిర్మించారు. నువ్వే నువ్వే సినిమా విడుదలై 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా AMB సినిమాస్‌లో స్పెషల్ షో వేసి, సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చిత్ర యూనిట్ అంతా హాజరయ్యారు. ఆ సినిమా అప్పట్లో ఘన విజయం సాధించింది.

ఈ ఈవెంట్లో తరుణ్ మాట్లాడుతూ..” సినిమా విడుదలై 20 ఏళ్ళు అయినా ఫస్ట్ డే ఫస్ట్ షో చూసినట్టు ఉంది. నాకు బోర్ కొట్టినప్పుడల్లా ఈ సినిమా యూట్యూబ్ లో చూస్తాను. అమ్మ, ఆవకాయ్, అంజలి, నువ్వే నువ్వే ఎప్పటికీ బోర్ కొట్టవు. నన్ను ‘నువ్వే కావాలి’ సినిమాతో రామోజీరావు గారు, ‘స్రవంతి’ రవికిశోర్ గారు హీరోగా పరిచయం చేశారు. ఆ తర్వాత స్రవంతి మూవీస్ సంస్థలో ‘నువ్వే నువ్వే’, ‘ఎలా చెప్పను’ సినిమాలు చేశాను. స్రవంతి రవికిశోర్ గారి బ్యానర్ లో మూడు సినిమాలు చేయడం నా అదృష్టం.”

Trivikram : భీమవరం వెళ్లి క్రికెట్ ఆడుకుంటుంటే నాకు ఫోన్ చేసి దర్శకుడిని చేశారు.. నీ ఇష్టం వచ్చినట్టు చావు అని నన్ను వదిలేశారు..

”హీరోగా నా తొలి సినిమా ‘నువ్వే కావాలి’కి త్రివిక్రమ్ గారు మాటలు రాశారు. దర్శకుడిగా ఆయన తొలి సినిమాలో నేను హీరో కావడం నాకు చాలా ఆనందంగా ఉంది. త్రివిక్రమ్ గారు ఎంత మంది హీరోలతో చేసినా ఆయన ఫస్ట్ హీరో మాత్రం నేనే. ప్రకాశ్ రాజ్ గారితో కలిసి మొదటిసారి ఈ సినిమాలో చేశాను. ప్రకాష్ రాజ్, శ్రియ, మిగిలిన నటీనటులందరితో పనిచేయడం చాలా ఆనందంగా అంది. ‘నువ్వే నువ్వే’ లాంటి సినిమా ఇంకొకటి అయినా చెయ్యమని చాలా మంది అడుగుతారు నన్ను. ఈ సినిమా నాకిచ్చినందుకు త్రివిక్రమ్ గారికి ధన్యవాదాలు” అని తెలిపారు.