Chandrababu Congratulate : RRR సినిమాకు అవార్డు రావడంపై చంద్రబాబు అభినందనలు.. జూ.ఎన్టీఆర్ పేరును ప్రస్తావించని బాబు

RRR సినిమాకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడం పట్ల ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. RRR సినిమాకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడంపై టీటీడీ అధినేత చంద్రబాబు అభినందించారు. ‘నాటు నాటు’ సాంగ్ కు అవార్డు రావడంతో కీరవాణి, రాజమౌళి, RRR టీమ్ కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

Chandrababu Congratulate : RRR సినిమాకు అవార్డు రావడంపై చంద్రబాబు అభినందనలు.. జూ.ఎన్టీఆర్ పేరును ప్రస్తావించని బాబు

CHANDRABABU

Chandrababu Congratulate : RRR సినిమాకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడం పట్ల ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. RRR సినిమాకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడంపై టీటీడీ అధినేత చంద్రబాబు అభినందించారు. ‘నాటు నాటు’ సాంగ్ కు అవార్డు రావడంతో కీరవాణి, రాజమౌళి, RRR టీమ్ కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. అయితే జూ.ఎన్టీఆర్ పేరును ట్వీట్ లో ప్రత్యేకంగా ప్రస్తావించలేదు. అటు చంద్రబాబు ట్వీట్ కు జూ.ఎన్టీఆర్ స్పందించారు. ‘థాంక్యూ సోమచ్ మామయ్య’ అంటూ అప్యాయంగా బదులిచ్చారు. మరోవైపు ఎన్టీఆర్ ను ట్యాగ్ చేస్తూ ఏపీ సీఎం జగన్ శుభాకాంక్షలు తెలిపారు. థాంక్యూ సర్ అంటూ సీఎం జగన్ కు ఎన్టీఆర్ రిప్లై ఇచ్చారు.

అయితే చంద్రబాబు చేసిన ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది. ఎందుకంటే కీరవాణి, రాజమౌళి, RRR టీమ్ ను మెన్షన్ చేస్తూ చంద్రబాబు శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే జూ.ఎన్టీఆర్ పేరును ప్రస్తావించకపోవడంతో ఇదొక హాట్ టాపిక్ అయిందని చెప్పవచ్చు. ఒక ప్రతిష్టాత్మకమైన అవార్డును RRR సినిమాలో జూ.ఎన్టీఆర్ ముఖ్యమైన పాత్ర పోషించారు కాబట్టి అతని పేరు ప్రస్తావించకపోవడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ హర్టైన పరిస్థితి ఉంది. ఒకే రిలేషన్ ఉన్న కుటుంబంలో నుంచి జూ.ఎన్టీఆర్ కు చంద్రబాబు ట్విటర్ లో శుభాకాంక్షలు తెలియజేయకపోవడం ఆశ్చర్యం కల్గిస్తోందని చెప్పవచ్చు.

RRR gets Golden Globe Award : కీరవాణికి వెల్లువెత్తుతున్న అభినందనలు.. గోల్డెన్ గ్లోబ్ అవార్డు వేదికపై కీరవాణి ఏం మాట్లాడాడో తెలుసా??

అయితే చంద్రబాబు జూ.ఎన్టీఆర్ కు ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పనప్పటికీ జూ.ఎన్టీఆర్ మాత్రం చంద్రబాబుకు థాంక్యూ చెప్పడం ఎలా ఉందో చూశారా అంటూ తారక్ ఫ్యాన్స్ పేర్కొంటున్నారు. ఏదేమైనా చంద్రబాబు చేసిన ట్విట్ ఇటు సిని ఇండస్ట్రీతోపాటు పొలిటికల్ గా కూడా చర్చనీయాంశంగా మారింది. జూ.ఎన్టీఆర్ తమ కుటుంబ సభ్యుడే, టీడీపీకి ఆయనెప్పుడు సపోర్ట్ గా ఉంటారని చెబుతున్న అందరికీ కూడా శుభాకాంక్షలు చెబుతున్న ఈ సమయంలోనైనా జూ.ఎన్టీఆర్ పేరు ప్రస్తావించ లేదంటే ఇది కావాలనే చేసినట్లుందని పలువురు అంటున్నారు.

ప్రపంచవ్యాప్తంగా RRR సినిమా కొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటికే ఇంటర్నేషనల్ లెవల్లో అనేక అవార్డులు అందుకున్న RRR సినిమా తాజాగా మరో పెద్ద అవార్డుని అందుకుంది. హాలీవుడ్ లో ఆస్కార్ తర్వాత అత్యంత ప్రతిష్టాత్మిక అవార్డు అయిన గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ లో ఇటీవల RRR నామినేట్ అయింది. గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ లో RRR సినిమా నుంచి నాటు నాటు సాంగ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ అవార్డు దక్కించుకొని చరిత్ర సృష్టించింది. ఈ పాటకి గాను అవార్డుని కీరవాణి అందుకున్నారు.

Narendra Modi : స్పెషల్ మూమెంట్.. ప్రతి ఇండియన్ గర్వపడేలా చేశారు.. RRR టీంపై ప్రధాని మోదీ పోస్ట్..

దీంతో చిత్రయూనిట్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక అభిమానులు, సినీ ప్రియులు కీరవాణికి, RRR చిత్రయూనిట్ కి అభినందనలు తెలుపుతున్నారు. రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన భారీ సినిమా RRR ఏ రేంజ్ లో విజయం సాధించిందో అందరికి తెలిసిందే. టాలీవుడ్ నుంచి హాలీవుడ్ దాకా RRR సినిమాని, దర్శకుడు రాజమౌళిని అందరూ పొగిడేశారు. ఇక హాలీవుడ్ లో అయితే అక్కడి సినీ ప్రియులు RRR సినిమాకి ఫిదా అయిపోయారు.