దసరా విషెస్ – టీజర్ అప్‌డేట్

నందమూరి కళ్యాణ్ రామ్, మెహరీన్ జంటగా 'శతమానం భవతి' ఫేమ్ సతీష్ వేగేశ్న దర్శకత్వంలో రూపొందుతున్న‘ఎంత మంచివాడవురా’.. టీజర్‌ అక్టోబర్ 9వ తేదీ ఉదయం 09:30 నిమిషాలకు విడుదల..

10TV Telugu News

నందమూరి కళ్యాణ్ రామ్, మెహరీన్ జంటగా ‘శతమానం భవతి’ ఫేమ్ సతీష్ వేగేశ్న దర్శకత్వంలో రూపొందుతున్న‘ఎంత మంచివాడవురా’.. టీజర్‌ అక్టోబర్ 9వ తేదీ ఉదయం 09:30 నిమిషాలకు విడుదల..

నందమూరి కళ్యాణ్ రామ్, మెహరీన్ జంటగా ‘శతమానం భవతి’ ఫేమ్ సతీష్ వేగేశ్న దర్శకత్వంలో రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్.. ‘ఎంత మంచివాడవురా’.. ప్రముఖ ఆడియో సంస్థ ఆదిత్య మ్యూజిక్ ఈ సినిమాతో నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టింది.

శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణ ప్రసాద్ సమర్పణలో, ఉమేష్ గుప్తా, సుభాష్ గుప్తా నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది. ప్రేక్షకులకు దసరా శుభాకాంక్షలు తెలుపుతూ.. టీజర్ అప్‌డేట్ ఇచ్చింది మూవీ టీమ్.

Read Also : ఇద్దరిలోకం ఒకటే – ఫస్ట్ లుక్..

ఈ సినిమా టీజర్‌ను అక్టోబర్ 9వ తేదీ ఉదయం 09:30 నిమిషాలకు విడుదల చెయ్యనున్నారు. 2020 సంక్రాంతికి ‘ఎంత మంచివాడవురా’ రిలీజ్ కానుంది. సంగీతం : గోపి సుందర్, కెమెరా : రాజ్ తోట, ఎడిటింగ్ : తమ్మిరాజు, ఆర్ట్ : రామాంజనేయులు, ఫైట్స్ : వెంకట్.