Akhanda-KGF 2: టెక్నో వార్.. కేజీఎఫ్-2 వర్సెస్ అఖండ..!

ఈ మధ్య కాలంలో మన తెలుగు సినిమాలను చూస్తే ఒకవిధంగా గర్వంగా ఉంటుంది సగటు సినీ అభిమానికి. కథల విషయంలో ఎలా ఉన్న మన మేకర్స్ సినిమాని హైస్టాండర్డ్స్ లో తీర్చిదిద్దుతున్నారు.

Akhanda-KGF 2: టెక్నో వార్.. కేజీఎఫ్-2 వర్సెస్ అఖండ..!

Akhanda Kgf 2

Akhanda-KGF 2: ఈ మధ్య కాలంలో మన తెలుగు సినిమాలను చూస్తే ఒకవిధంగా గర్వంగా ఉంటుంది సగటు సినీ అభిమానికి. కథల విషయంలో ఎలా ఉన్న మన మేకర్స్ సినిమాని హైస్టాండర్డ్స్ లో తీర్చిదిద్దుతున్నారు. మన సినిమా మార్కెట్ పరిధి కూడా పెరగడంతో ఖర్చుకు ఏ మాత్రం వెనకాడకుండా ప్రపంచంలో మంచి టెక్నాలజీ ఎక్కడా ఉన్నా అందిపుచ్చుకొని మరీ ఇక్కడ ఉపయోగిస్తున్నారు. పాన్ ఇండియా సినిమాలు తెరకెక్కిస్తున్న మన దర్శక, నిర్మాతలు.. ఆ స్థాయికి తగ్గట్లే విజువల్ ట్రీట్ ఇస్తున్నారు ప్రేక్షకులు.

Telugu Stars: నెక్స్ట్ ఏంటి.. కన్ఫ్యూజన్‌తో జుట్టు పీక్కుంటున్న ఫ్యాన్స్!

బాలయ్య కెరీర్ లో మరోసారి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన సినిమా అఖండ. డిసెంబర్ 2వ తేదీన విడుదల కానున్న ఈ సినిమా గురించి ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. ఇందులో భారీ యాక్షన్ సన్నివేశాలు ఉండనున్నాయి. ముఖ్యంగా బాలయ్య అఘోరాగా చేసిన సన్నివేశాలు మరింతగా ఎలివేట్ చేసేందుకు పాన్ టైం అనే సరికొత్త హైఎండ్ టెక్ కెమెరాను ఉపయోగించారట. ఇండియన్ సినిమా చరిత్రలోనే ఉపయోగించని ఈ కెమెరాను ఏకంగా 96 రోజుల పాటు ఉపయోగించారంటే సాధారణ విషయం కాదు.

Aishwarya Rajesh: ప్యూర్ హోమ్లీ లుక్‌లో ఐశ్వర్య.. ఫోటోలు!

కాగా, ఇదే కెమెరాను సౌత్ దర్శక దిగ్గజం ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ 2 కోసం ఉపయోగించారట. అయితే.. కేజేఎఫ్ 2 కోసం జస్ట్ వారం రోజులే ఈ హైఎండ్ కెమెరాను ఉపయోగించారట. అయితే.. టెక్నాలజీ పరంగా కేజేఎఫ్ 2లో ఎక్కువ భాగంగా అధునాతన టెక్నాలజీని ఉపయోగించినట్లు చెప్తున్నారు. ఈ రెండు సినిమాలలో విజువల్ ట్రీట్ ఎలా ఉండనుంది.. ఏ సినిమా ఎక్కువ శాతం మేకర్స్ ను ఆకర్షించనుందన్నది ఇప్పుడు సినీ పరిశ్రమలో చర్చకు దారితీస్తుంది.