Hanuman : టీజర్ రెస్పాన్స్ తరువాత హనుమాన్ కథ మారింది.. దర్శకుడు ప్రశాంత్‌ వర్మ!

తేజ సజ్జ (Teja Sajja) నటిస్తున్న సూపర్ హీరో మూవీ 'హనుమాన్' టీజర్ కి వచ్చిన రెస్పాన్స్ తరువాత స్టోరీలో చేంజెస్ చేశారట. అందుకే మూవీ రిలీజ్ కూడా పోస్ట్‌పోన్ అయ్యింది.

Hanuman : టీజర్ రెస్పాన్స్ తరువాత హనుమాన్ కథ మారింది.. దర్శకుడు ప్రశాంత్‌ వర్మ!

Teja Sajja Hanuman movie script change after teaser response

Teja Sajja Hanuman : యువహీరో తేజ సజ్జ నటిస్తున్న సూపర్ హీరో మూవీ ‘హనుమాన్’. భారతీయ ఇతిహాసాల్లో రామభక్తుడిగా అందరికి తెలిసిన హనుమంతుడి పాత్రని సూపర్ హీరోగా పరిచయం చేస్తూ ఈ సినిమాని ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీ పై ముందుగా ఎటువంటి అంచనాలు లేవు. కానీ టీజర్ రిలీజ్ తరువాత సినిమా పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. దీంతో మేకర్స్ పై ప్రెజర్ పెరిగిపోయింది. ఆడియన్స్ అంచనాలు అందుకునేలా సినిమాలో కొన్ని చేంజెస్ చేయాలనీ నిర్ణయించుకున్నారట.

Shaakuntalam : కాన్స్ ఫెస్టివల్‌లో ఏకంగా 4 అవార్డులు అందుకున్న శాకుంతలం.. ఏ కేటగిరీల్లో తెలుసా?

ముందుగా ఈ సినిమాని మే నెలలో రిలీజ్ చేస్తామంటూ ప్రకటించారు చిత్ర నిర్మాతలు కానీ పోస్ట్‌పోన్ చేస్తూ ఇటీవల తెలియజేశారు. సినిమా ఆల్మోస్ట్ పూర్తి అవుతుంది అనుకున్న సమయంలో ఏదో వెలితి కనిపించిందట. దీంతో ఆ మూవీలో ఒక పాత్రని యాడ్ చేశాడట దర్శకుడు. ఆ పాత్ర సినిమాలో హైలైట్ కానుందట. అలాగే ఈ సినిమాలో మొత్తం 1600 VFX షాట్స్ ఉన్నాయట. వీటివల్లే సినిమా విడుదల లేట్ అయ్యినట్లు చెప్పుకొచ్చాడు. జూన్ ఎండ్ కి VFX వర్క్ మొత్తం కంప్లీట్ అవుతుందని, జులై ఫస్ట్ వీక్ లో రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేస్తామంటూ తెలియజేశాడు. అలాగే మూవీని మొదట కేవలం తెలుగులోనే రిలీజ్ చేద్దాం అనుకున్నారట. కానీ టీజర్ కి వచ్చిన రెస్పాన్స్ తో ఇతర భాషల్లో కూడా రిలీజ్ చేద్దామని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు.

Kamal Haasan : కేరళ స్టోరీ పై కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలు.. నిజం అనగానే నిజం అయ్యిపోదు!

ఇక గ్రాఫిక్స్ విషయంలో ఈ సినిమాతో పోలుస్తూ ప్రభాస్ ఆదిపురుష్ (Adipurush) సినిమాని ట్రోల్ చేసిన సంగతి తెలిసిందే. దాని గురించి ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ.. “గ్రాఫిక్స్ వర్క్ అనేది చాలా ఎక్కువ సమయం తీసుకుంటుంది. అలా సమయం తీసుకోకుండా త్వరగా చేస్తే బెటర్ అవుట్ పుట్ రాదు. ఇప్పుడు ఆదిపురుష్ ట్రైలర్ చూసి అందరూ బాగుంది అంటున్నారు. దానికి కారణం టైం తీసుకోవడం వలనే కదా” అంటూ చెప్పుకొచ్చాడు. ఇక హనుమాన్ తరువాత ప్రశాంత ‘అధీర’ అనే మరో సూపర్ హీరో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇంద్రుడి స్టోరీతో రాబోతున్న ఆ చిత్రానికి హనుమాన్ మూవీకి సంబంధం ఉంటుందని తెలియజేశాడు.