BiggBoss Non Stop : ఈ వారం బిగ్‌బాస్‌ నుంచి తేజస్విని అవుట్

ఐదో వారంలో బిందు మాధవి, యాంకర్ శివ, అరియనా, మిత్రా శర్మ, అనిల్ రాథోడ్, తేజస్వి, స్రవంతి నామినేషన్స్ లో ఉన్నారు. చివరి వరకు లాస్ట్ పొజిషన్ లో మిత్రా శర్మ, తేజస్వి ఉండగా అంతా........

BiggBoss Non Stop : ఈ వారం బిగ్‌బాస్‌ నుంచి తేజస్విని అవుట్

Tejaswi

Tejaswi Madivada :  బిగ్‌బాస్ నాన్ స్టాప్ అని చెప్పి ఈ సారి నాగార్జున హోస్ట్ గా ఓటీటీలో టెలికాస్ట్ అవుతున్న సంగతి తెలిసిందే. దీనికి అంతకు ముందు ఉన్న క్రేజ్ అయితే లేదు. బిగ్‌బాస్ అభిమానులు, అందులో ఉన్న కంటెస్టెంస్ట్ అభిమానులు మాత్రమే వాళ్ళ కోసం షో చూస్తున్నారు. ఇక షోలో ఇచ్చే టాస్కులు కూడా అంతగా ఆసక్తికరంగా లేవు. మొత్తం 17 మంది కంటెస్టెంట్స్ తో మొదలైన బిగ్ బాస్ నాన్ స్టాప్ అయిదు వారాలు పూర్తి చేసుకోగా ఇప్పటికే హౌస్ నుంచి నలుగురు ఎలిమినేట్ అయ్యారు. మొదటి వారంలో ముమైత్ ఖాన్, ఆ తరువాత శ్రీరాపాక, మూడో వారంలో ఆర్జే చైతూ, నాలుగో వారం సరయు ఎలిమినేట్ అయింది.

ఇక ఐదో వారంలో బిందు మాధవి, యాంకర్ శివ, అరియనా, మిత్రా శర్మ, అనిల్ రాథోడ్, తేజస్వి, స్రవంతి నామినేషన్స్ లో ఉన్నారు. చివరి వరకు లాస్ట్ పొజిషన్ లో మిత్రా శర్మ, తేజస్వి ఉండగా అంతా మిత్రా శర్మ ఎలిమినేట్ అవుతుంది అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఈ వారం తేజస్వి మడివాడ ఎలిమినేట్ అయింది.

Balakrishna : అభిమానుల కోరిక మేరకు.. మళ్ళీ థియేటర్లోకి ‘అఖండ’

తేజస్వి ఎలిమినేట్ అయ్యాక వేదికపైకి వచ్చి మాట్లాడింది. తేజస్వి మాట్లాడుతూ.. ”నేను సన్యాసం తీసుకున్నాను. మూడేళ్ల నుంచి పెద్దగా రియాక్షన్స్‌ లేవు. అందుకే హౌస్‌లో కూడా కూల్‌గా ఉన్నా. అదే మైనస్‌ అయి ఉంటుంది. లాస్ట్ టైం బిగ్‌బాస్‌కు వచ్చినప్పుడు అందరిపైనా కోపం చూపించానని ఎలిమినేట్‌ చేశారు. ఇప్పుడు ఆ కోపం చూపించడం లేదని ఎలిమినేట్‌ చేస్తున్నారు” అని తెలిపింది.

Rahul Sipligunj : నేను ఏ పరీక్షకైనా సిద్దమే.. రాడిసన్ ఘటనపై స్పందించిన రాహుల్ సిప్లిగంజ్..

ఇక ఉగాది తర్వాతి రోజే తేజస్వి ఎలిమినేట్ అవ్వగా ఉగాది సందర్భంగా ఎవరికి తీపి, చేదు లడ్డూలు ఇస్తావని నాగార్జున అడిగాడు. దీంతో తేజస్వి.. అఖిల్‌, స్రవంతి, అరియానా, అషులకు తీపి లడ్డూలు ఇస్తానని, బిందు మాధవి, శివలకు చేదు లడ్డూలు ఇస్తానని, ఇక నటరాజ్‌ మాస్టర్‌కు తీపి, చేదు రెండు లడ్డూలు ఇస్తానని తెలిపింది. 17 మందితో మొదలైన షోలో ఈ వారంతో అయిదుగురు ఎలిమినేట్ అవ్వగా మరో 12 మంది మిగిలారు.