Big Boss 5: ఏడుగురిని గొర్రెలుగా చేసిన హౌస్‌లోకి వచ్చిన ఓ గుంట నక్క!

బిగ్ బాస్ సీజ‌న్ 5 మొద‌లై అప్పుడే వారం పూర్తైంది. హౌజ్ నుండి ముందుగా స‌ర‌యు బ‌య‌ట‌కు వెళ్లగా వెళ్లేప్పుడు త‌న ఆక్రోశాన్ని కక్కి వెళ్లింది. ఇక సోమ‌వారం రోజు నామినేష‌న్ ప్ర‌క్రియ..

10TV Telugu News

Big Boss 5: బిగ్ బాస్ సీజ‌న్ 5 మొద‌లై అప్పుడే వారం పూర్తైంది. హౌజ్ నుండి ముందుగా స‌ర‌యు బ‌య‌ట‌కు వెళ్లగా వెళ్లేప్పుడు త‌న ఆక్రోశాన్ని కక్కి వెళ్లింది. ఇక సోమ‌వారం రోజు నామినేష‌న్ ప్ర‌క్రియ జ‌ర‌గ‌గా, ఈ ప్ర‌క్రియ‌లో హౌజ్‌మేట్స్ ఉగ్ర‌రూపం చూపించగా.. త‌మ మ‌న‌సులో ఉన్న కార‌ణాలు చెబుతూ ముఖానికి రంగు పూసి మ‌రీ నామినేట్ చేశారు. మొత్తానికి ఈ వారం ఏడుగురు సభ్యులు ఎలిమినేషన్ కు నామినేట్ అయ్యారు. ఇక మంగళవారం ఏపిసోడ్‌లో ఎన్నో ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా టాస్క్ లో కంటెస్టెంట్లు చాలామంది ఒకరిని ఒకరు కొట్టుకోవడానికి కూడా సిద్ధపడ్డారు.

PV Sindhu Biopic: దీపికా మరో క్రేజీ ఫిల్మ్.. సిల్వర్ స్క్రీన్ మీద సింధు సక్సెస్ స్టోరీ!

సోమవారం నామినేషన్‌కి బాగా హర్ట్‌ అయిన నటరాజ్‌ మాస్టర్‌.. హౌస్‌లోకి వచ్చిన ఓ గుంట నక్క మంచి మనుషులుగా ఏడుగురిని గొర్రెలుగా తయారు చేసిందని విమర్శించారు. దీనిపై యాంకర్‌ రవి మాస్టర్‌ని నిలదీశాడు. అసహనానికి గురైన రవి.. నటరాజ్ మధ్య కాస్త వాడీవేడి యుద్ధం నడిచింది. ఉమాదేవికి సన్నీ మధ్య సుదీర్ఘ చర్చలు జరగగా.. ఇంట్లో కోపం, ప్రేమ రెండూ ఉండాలని సన్నీ ఆమెను రిక్వెస్ట్‌ చేశాడు. ఉమా ఏమో ఎప్పటి మాదిరే ‘నేను ఇలాగే ఉంటా, ఎవరితోనైనా ఇలానే మాట్లాడుతా’.. తన మొగుడితో అయినా కూడా అలానే మాట్లాడతాను అంటూ మరోసారి కౌంటర్ ఇచ్చింది.

Icon Star Allu Arjun: లైన్‌లో మరో రెండు సినిమాలు.. తగ్గేదే లే అంటున్న బన్నీ!

కెప్టెన్ టాస్క్ కూడా కాక రేపింది. ప్రతి టీమ్‌ ఇతర టీమ్‌లోని డగౌట్స్‌లో ఉన్న పిల్లోస్‌ని తెచ్చుకొని తన డగౌట్స్‌లో పెట్టుకోవాలి. అలాగే ఇతర టీమ్‌లోని పిల్లోస్‌ని వారికి దొరకుండా చూసుకోవాలి. ఇలా మొత్తం ‘దొంగలున్నారు జాగ్రత్త’ టాస్క్‌ పూర్తయ్యే వరకు ఏ టీమ్‌లో ఎక్కువగా పిల్లోస్‌ ఉంటాయో అవే ఫ్లాగ్స్‌గా లెక్కించబడతాయి. చివరకు ఏ టీమ్‌ దగ్గరైతే ఎక్కువగా ఫ్లాగ్స్‌ ఉంటాయో వాళ్లే విజేతలుగా నిలుస్తారు. గెలిచిన టీమ్‌ నుంచే కెప్టెన్సీ కంటెండర్‌ ఎంచుకోబడతారు. ఈ టాస్క్‌ని ఇరు జట్లు సీరియస్‌గా తీసుకున్నాయి. టాస్క్ లో భాగంగానే పిల్లోస్ లాక్కునే క్రమంలో సిరి షర్ట్‌లో సన్నీ చేయి పెట్టాడని.. సిరి చాలా పెద్ద గొడవ చేసింది.

Akkineni Heroes: బ్యాక్ టూ బ్యాక్ అక్కినేని సినిమాలు.. హ్యాపీ మూడ్‌లో ఫ్యాన్స్!

అయితే సన్నీ మాత్రం నేను అలా చేయలేదని చెప్పగా.. వీడియో స్లో మోషన్ లో చూస్తే సన్నీ చేయపెట్టలేదని కనిపిస్తోంది. సిరి ఇక్కడ ఉమెన్ కార్డ్ వాటినట్టు విమర్శలు వస్తున్నాయి. ఇక టాస్క్‌లో భాగంగా జరిగిన తోపులాటలో లోబో కళ్లు తిరిగి కిందపడిపోగా ఇంటి సభ్యులంతా డాక్టర్‌ని రప్పించాలని బిగ్‌బాస్‌కు విన్నవించారు. బిగ్‌బాస్‌ ఆదేశంతో లోబోని మెడికల్‌ రూమ్‌కి తరలించారు. ఈ మధ్యలోనే రవి-విశ్వ మధ్య గొడవ జరిగింది. నక్క టీమ్‌ సభ్యుల నుంచి పిల్లోస్‌ లాక్కునేందకు శ్రీరామచంద్ర ప్రయత్నించడంతో రవి ఫైర్‌ అయ్యాడు. గద్ద టీమ్‌ సభ్యుడైన విశ్వ.. మాటలు మంచిగా రానివ్వంటూ రవిపై సీరియస్‌ అయ్యాడు. రవి వెళ్లి విశ్వకి సారీ చెప్పాడు. మొత్తానికి టాస్క్‌.. కంటెస్టెంట్స్‌ల్లోని కోపాన్ని వెలికితీస్తే.. ఇక రెండో టాస్క్‌ ‘సాగరా సోదరా’ అయితే మరో రేంజ్‌లో ఉంటుందని ప్రోమో వదిలి చూపించారు. మరి రెండో టాస్క్‌లో గొడవలు ఏ స్థాయికి చేరాయో బుధవారం ఎపిసోడ్ లో చూడాలి.

10TV Telugu News