అదరగొడుతున్న ‘ఆహా’ – వన్ మిలియన్ యూప్ డౌన్‌లోడ్స్

‘ఆహా’ డిజిటల్ రంగంలో సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తోంది..

10TV Telugu News

‘ఆహా’ డిజిటల్ రంగంలో సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తోంది..

ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఇటీవల డిజిటల్ రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. అమెజాన్,  నెట్ ఫ్లిక్స్‌కు ధీటుగా తెలుగు సినిమాలను ప్రేక్షకులకు మరింత దగ్గర చేసేందుకు అల్లు అరవింద్ ‘ఆహా’ అనే ఓటీటీ(OTT) ఫ్లాట్ ఫామ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ యాప్‌లో ప్రస్తుత ట్రెండ్‌కు తగ్గట్టు వెబ్ సిరీస్‌లు, లెటెస్ట్ మూవీస్ ఆడియన్స్‌కు అందుబాటులో ఉన్నాయి. తాజాగా ‘ఆహా’ యాప్‌ను అక్షరాలా పదిలక్షల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు.

aha

తెలుగులో మొట్టమొదటి ఎంటర్‌టైన్‌మెంట్ డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌గా దూసుకుపోతోంది ‘ఆహా’. ఫిబ్రవరిలో టెస్ట్ లాంఛ్ చేశారు. ఉగాది సందర్భంగా మార్చి 25న యాప్‌ను గ్రాండ్‌గా లాంఛ్ చేయాలని భావించారు కానీ ప్రస్తుత పరిస్థితుల రీత్యా వాయిదా వేశారు. ప్రస్తుతం ‘సిన్‌’, ‘లాక్డ్’ వంటి కంటెంట్ బేస్డ్ వెబ్‌సిరీస్‌ల‌ు స్ట్రీమింగ్ అవుతూ ఎంట‌ర్‌టైన్‌మెంట్ విభాగంలో స‌త్తా చాటుతున్నాయి. కొత్తగా పెళ్లైన జంట మ‌ధ్య సాగే క‌థే  ‘సిన్’. శ‌ర‌త్ మారార్ నిర్మించిన ఈ వెబ్‌సిరీస్‌కు న‌వీన్ మేడారం (బాబు బాగా బిజీ ఫేమ్) డైరెక్ట‌ర్.. బోల్డ్ కంటెంట్‌తో, డొమెస్టిక్ వ‌యొలెన్స్‌కి వ్య‌తిరేకంగా ఒక మెసేజ్ ఓరియంటెంట్‌తో తీసిన వెబ్‌సిరీస్ ఇది. ‘మ్యారేజ్ నో ఎక్స్‌క్యూజ్’ అనే క్యాంపెయిన్‌ని నిర్వ‌హిస్తుంది ఈ టీమ్‌.

Read Also : అది విరాళం.. రౌడీ మామూలు కాదు – దర్శకుడు దేవ కట్టా

aha

ఇక ‘లాక్డ్‌’ విషయానికొస్తే సత్యదేవ్ ముఖ్య పాత్రలో నటించగా కృష్ణ కుల‌శేఖ‌ర‌న్ నిర్మాణంలో ప్ర‌దీప్ దేవ‌కుమార్ ద‌ర్వ‌క‌త్వం వ‌హించిన ఈ వెబ్‌సిరీస్ థ్రిల్ల‌ర్ బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. ఈ వెబ్‌సిరీస్ ప్రివ్యూ లాంచ్ సంద‌ర్భంగా న‌టీన‌టులు.. వ‌ర‌ల్డ్ హెల్త్ ఆర్గ‌నైజేష‌న్ ప్ర‌తిపాదించిన సేఫ్ హ్యాండ్స్ ఛాలెంజ్‌ను చేప‌ట్టి ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న క‌ల్పించారు. వీటితోపాటు ‘ఆహా’ సొంతంగా స‌మ‌ర్పించిన ‘మ‌స్తీస్’, ‘కొత్త పోర‌డు’, ‘షిట్ హాపెన్స్’, ‘గీతా సుబ్ర‌మ‌ణ్యం’ వంటి సిరీస్‌లకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ‘అర్జున్ సురవరం’, ‘ఎన్‌జికె’, ‘ఖైదీ’, ‘ప్రెషర్ కుక్కర్’, ‘సవారి’, ‘చూసీ చూడంగానే’, ‘సూర్యకాంతం’ వంటి సినిమాలు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం నెలకొన్న లాక్‌డౌన్ పరిస్తితిలో ‘ఆహా’తో అన్‌లిమిటెడ్ ఎంటర్‌టైన్‌మెంట్‌ పొందవచ్చు.

aha